పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మార్చి 2014, సోమవారం

Sri Venkatesh కవిత

---మరణం--- మరణం ఒక గమ్యం చేరితే నిద్రలో దొరికే సుఖం శాశ్వతం మరణం ఒక జననం జన్మించాక మళ్ళీ మన గమ్యం మరణం మరణం ఒక సైన్యం ఒకరికి మాత్రమే కట్టుబడి పని చేసే సైన్యం మరణం ఒక ప్రపంచం కనురెప్పల ఎడబాటులో కనపడని కనురెప్పల స్థిర కలయికలో దాగలేని ఒక అద్భుత ప్రపంచం మరణం ఒక మన్మధయాగం కాలే కట్టె రగిలే శరీరపు రాసక్రీడలో బూడిదను జన్మింపజేసే ఒక మన్మధయాగం మరణం ఒక బంధం మనతో పాటే పుట్టి మనతో పాటే చచ్చే విడిచి వెళ్ళని విడదియ్య సాధ్యం కాని మర్మబంధం మరణం ఒక అదృష్టం మనిషిని చంపి అబద్ధపు కళ్ళతో నిజాన్ని చూసే లోకానికి దూరంగా బ్రతికిపోగలిగేలా చేసే అదృష్టం...... "శ్రీ" 10/03/2014

by Sri Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ObRwDY

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి