పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మార్చి 2014, సోమవారం

Chythenya Shenkar కవిత

రాజనీతి! || చైతన్య --------------- రాజు గెల్చాడు! కానీ, సైనికులే చచ్చారు... ప్రపంచ పటంలో దేశం... ఇండో-ఇటాలియన్ వంటకంలా ఉంది! ఓటు -> నోటు పొట్లంలో మందు కంపు కొడుతుంది! ఓట్లకోసం కోట్లిస్తున్నారని... బట్టలూడదీసుకు చూస్తున్న ఓటర్లు! ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చింది! బ్రతికే ఉందని నమ్మించే ప్రయాసే నేతల్ది.. నాతో ఎందరొస్తారు! ప్రజాస్వామ్యం శవయాత్రనాపేందుకు... రైతు కళ్ళలో... కన్నీటి కలుపు తీసేదెవ్వరో! పొలాల్లో రైతా..!? ఉన్నాడుగా... "నేతలు" పొలాల్నే శ్మశానాలుగా మార్చారంతే పాపం అమాయక ఓటరీడు... ఇండియాలో తప్ప ఇంకెక్కడా బ్రతకలేడు! రాజీ పడలేని.. సిగ్గులేని ప్రయాణం..రాజకీయం! ఓటును బ్రతికిస్తూ... నిన్ను నువ్వు చంపుకుంటూ.."మద్యే"మార్గం! లంచాల మంచం పై... చెరచబడ్డ ప్రజాస్వామ్యం నా దేశం!!!!!! CM ఐదు వేళ్ళూ లోనికి.. ఎన్నో ఆకలి కడుపులు కాటికి! తెల్ల దొరలే నయం! పేదలకు ఇంకా రాని స్వాతంత్ర్యం! ప్రజాస్వామ్యం గట్టిగుంటే అవినీతినేత చెంప చెళ్ళుమనదెందుకో! పోరాటం ఆగలేదు! అపుడు- తెల్లవాళ్ళతో..ఇపుడు దగుల్బాజీలతో.. 10/03/2014

by Chythenya Shenkar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oD77rv

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి