తిలక్/ఇంకొన్ని ----------------- కొన్ని క్షణాలు కొన్ని గంటలు కొన్ని పగళ్ళు కొన్ని రాత్రులు నిర్వచించలేని అనుభవాలను మిగులుస్తాయి మళ్ళా ఇప్పుడు వాటిని వెనక్కి తోడుకుంటూ నూనే పాదాలతో ఒకసారి నడవాలి నాకు నేనుగా దారపు పోగుల్లా సాలేగూడులో అల్లుకున్న మరికొన్ని జ్ఞాపకాలు ఈరోజిక ముఖం కడుక్కోవాలి కొంచం కొత్తగా కొన్ని భావోద్వేగాలతో రమిస్తూ నిన్ను మళ్ళీ కంటున్నాను నాలో నిశబ్దంగా వేదంలా తోస్తావు కొన్ని క్షణాల్లో నాగురించి అన్నీ తెలిసినట్టు ప్రతి నీ పేజీలో నా పేరును వెతుక్కుంటాను నువ్వు లేనప్పుడల్లా ఇప్పుడు మళ్ళా కళ్ళలో ఇంకిపోయిన భీడు బావులేవొ మొలకెత్తుతున్నాయి చాలా కాలం తరువాత కొత్త ఆశలకు పునాది. తిలక్ బొమ్మరాజు 10.03.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k8Tz7h
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k8Tz7h
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి