జననీ జయకేతనం --------------------- అణగదొక్కిన చరిత్ర కిప్పుడు పట్టాభిషేకం- పురిటి గండాల నీది బాలారిష్టాల తట్టుకొని యవ్వనోద్రేక ప్రమాదాల దాటుకుని పళ్ళూడే షష్ట్యాదశమాంకపు జీవితాన కల ఇంటికి చేరిన వేళకి దండం- గోలకొండ కోటల తెగిన రామదాసు సంకెల ముడుపులు తీర్చిన మూలపుటమ్మలు సమ్మక్క సారక్క పెత్తనాన్ని తుత్తునియలు చేసిన రుద్రమ కరవాలం కొమురం భీం తలపాగల మెరిసిన చంద్రవంక మడికట్టుల మొలిచిన నాగేటిచాల్లల్ల గోదావరమ్మ అలుగు దుంకిన వేళకి దండం- పాయిదార్లు పట్టిన భాషా యుద్దంల జీవగంధపు పరిమళం చిమ్మిన యాస కడుపు చూసి,పీట ఏసి అంబలి పట్టిన పెద్దముత్తయిదువ ఎడ్డితనమనే ఎక్కిరింపుల మూర్చిల్ల జేసినమల్లినాధుని అక్షర వెలుగు కారం పొడి, చీపురుకట్టలే తరతరాల బూజు,బురుజులను ధ్వంసించిన కొట్లాట ముచ్చట భూమిల నిక్షిప్తమైన సాంస్క్రతిక నిధుల పొద్దుపొడుపు కలవరపడ్డ కళలన్నీబతుకమ్మ చుట్టూ అల్లుకుపోయిన వేళకి దండం- మెదళ్ల సాగులో కాంక్షాకురాలు పూయించిన సిద్దాంత బ్రహ్మ నవ్వుతున్నడు సకలంబందుల్,మాడ్చిన కడుపుల్ ,సాగర హారాల్ తీరొక్క జిద్దుల తిమ్మిరెక్కించిన ముఖాల అలసట అలసిపోయింది ఇనుప కంచెలను రబ్బరు బుల్లెట్లను ఎడం కాలితో తన్నిన ఉస్మానియా కాంపస్ సర్టిఫికెట్లకు పటం కట్టుకుంటున్నది కల చిగురుటాకై వణుకుతున్నప్పుడల్లా బతుకుల దహించుకుని ఇంధనమైన అమరులస్తూపం గెలుపుని ముద్దాడుతున్నది బక్క ప్రాణానికీ భారీ లక్ష్యానికీ అరవై ఏళ్ల దూరం బుకా గులాల్ తో ఎదురొచ్చిన వేళకి నాలుగున్నర కోట్ల దండం- ఇక తెలంగాణ పదం ప్రపంచం నోటి నిండా ...! 24-02-2014.
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cHHuDG
Posted by Katta
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cHHuDG
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి