పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఫిబ్రవరి 2014, సోమవారం

బాలసుధాకర్ మౌళి కవిత

విద్యార్థుల కవిత్వం: -------------------- 11. సాలాపు దాలి నాయుడు ------------------------------- నాలుగు తాలు కట్టిన గూడతో.. ------------------------------- కోడి కుయ్యనే లేదు పొద్దు పొడవనే లేదు సూర్యకిరణాలు భూమిని తాకనే లేదు నాకు అమ్మానాన్న నోట పిలుపు వినిపించింది ఆ పిలుపు విని నేను కంగారుగా లేచాను మా గోడ పక్క గడియారం చూస్తే చిన్నముళ్లు ఒకటి దగ్గర - పెద్ద ముళ్లు పన్నెండు దగ్గర దట్టమైన పొగమంచు చూడడానికి కళ్లు కనిపించడంలేదు అమ్మానాన్న నన్ను లేపి గూడ డబ్బను పట్టుకోమన్నారు ఆ గూడకు నాలుగు వైపులా నాలుగు తాలు కట్టి పట్టుకోమన్నారు అర్థరాత్రి వేళ శ్మశానం దాటి పోతున్నం మా దగ్గర ఏమీ లేదు - నాన్న చేతిలో టార్చ్ లైట్, అమ్మ చేతిలో తువ్వాల, నా చేతిలో గూడ తప్ప - ఆ అర్థరాత్రి వేళ అమ్మను నన్ను గూడను పట్టుకుని వెయ్యమన్నాడు నాన్న నాన్న మాత్రం వరిసేనుకు తారీలు కట్టి వస్తానని వెళ్లాడు - ఆ అర్థరాత్రి అమ్మా నేను - నాలుగు తాళ్లు కట్టిన గూడ డబ్బాతో చెరువులో వున్న నీటిని పొలంలోకి తోడుతున్నం పొద్దు గడవనే గడిచింది పొలంలో నీరు కలవనే కలిసింది అప్పుడు అమ్మ వరిసేను వైపు చూసి దండం పెడుతుంది, ఎలా అంటే.. 'అమ్మా పొలమా.. నువ్వు మాకు తినడానికి తిండినిస్తావు.. మాకు తెలుసు ! మేము నీ కోసం పెట్టిన మదుపు చేసిన అప్పులు నీతోనే వున్నాయి.. నువ్వు మా నంద నింపేలా పొట్ట వెయ్యమనీ ' - అమ్మ దండం పెడుతుంది కొన్ని రోజులు పోయాక తెలియాలి మా అమ్మ దండం ఫలితం. ---------------------------- 24.02.14

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxBuP5

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి