పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఫిబ్రవరి 2014, సోమవారం

Rajkumar Bunga కవిత

ఆర్కే ||మబ్బులు|| ఎన్నోమబ్బులు కారుమబ్బులు కరిగివర్షించే మబ్బులు కౌగిలిలో మురిపించే మబ్బులు కరడుగట్టిన మరికొన్నిమబ్బులు ఎగిరొచ్చి తాళితెంపిన తాగొచ్చి కుళ్ళబొడిసిన ఉరిమే మొగుడుమబ్బుతో రాజీపడుతూ అమ్మఆకాశం ...అదే ప్రేమతో కాలంవేగంతో పరుగులుతీసి కాలుజారిన కన్నపేగుమబ్బును మళ్లీ తన గర్భంలో దాచుకొంటు అమ్మఆకాశం ...అదే ప్రేమతో క్షణ క్షణం తలకొరివి పెడుతూ నోటికాడ గింజను బజారుదానికెట్టి వావివరసలు లేని కొడుకుమబ్బును అనుక్షణం పురిటిస్నానం చేయిస్తూ అమ్మఆకాశం ...అదే ప్రేమతో తొలిరేయి గదిలో తెల్లని కాంతి తెల్లని చీర తెల్లని పాలు తెల్లని పూలు తెల్లని పాన్పు మబ్బులు తెలియని అమ్మఆకాశం తెల తెల్లగా!! సుడిగాలులు వడగాలులు చలిగాలులు అన్నీ వచ్చి వెళ్ళిపోయాయి సూరీడు ఈ కొన నుండి ఆ కొనవరకు ప్రాకతు నడిచి పరుగెత్తుకెళ్ళాడు అమ్మఆకాశం అలసిపోయి తెల్లని వస్త్రంలో చుట్టబడింది, అచ్చం తన తొలిరేయిల. మబ్బులన్నీ కలిసికట్టుగా అమ్మఆకాశాన్నిఆరడుగుల గోతిలో నెట్టేశారు! అమ్మఆకాశం ఇప్పుడో జ్ఞాపకం మాత్రమే .... తెల్లని తెలుపులా !! ఆర్కే ||మబ్బులు||20140224

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fgYMnS

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి