పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఫిబ్రవరి 2014, సోమవారం

Sasi Bala కవిత

మరువలేని మమత .......శశిబాల ........................................................ మరువలేను ఏ క్షణం నిన్ను కలిసిన తోలి క్షణం చెక్కులపై జాలువడిన అశ్రువు దోసిట పట్టిన క్షణం ఆర్తినొందు హృదయాన్ని అక్కున చేర్చిన వైనం మూగ గుండె వీణ తాకి ప్రేమ మీర శ్రుతి చేసి అపురూప రాగమేదో పలికించిన నీ అనుబంధం ఏమని చెప్పను????? ఎలా చెప్పను ???? ఎదురుచూసే ఉదయ సంధ్యలు ఎడబాయని ఒంటరితనం విడువను విడువను అంటూ మది చేరిన మమకారం కడలి నిండు నీరు వున్నా తీరని మమకార దాహం తనువునేమి చేయలేక తలపుల తాకిన క్షణం ఎలా చెప్పేది ??? మనసు ఎలా విప్పేది పడకింటికి కళ్ళు లేవు తడిసిన దిండుకు నోరు లేదు నా వ్యధను నీకు వివరించే చక్రవాకి ఒకటి లేదు పున్నమిలో మబ్బు దాగిన రాకా చందురుడు లేడు నీ నిష్క్రమణ చేసిన గాయానికి పూత పూసే అమృత హస్తం లేదు వాడిన జాజులనడుగు ఎదురు చూపులో ఎర్రబడి,వాడిన ముఖబింబాన్ని శుకపికాలనడుగు అవ్యక్త రాగమైన నా మది అనురాగాన్ని ఇంతకంటే చెప్పలేను చిగురు మనసు విప్పలేను ..............24 feb 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dmbMcj

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి