పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఫిబ్రవరి 2014, సోమవారం

Maddali Srinivas కవిత

నిరీక్షణ!//శ్రీనివాస్//24/02/2014 ------------------------------------------------------------- మెత్తని కత్తి దూసి నిలువునా చీల్చిన మేను రెండు పక్కలా నెత్తురోడుతున్నది యెనస్థీషియా మత్తులో ఒక సగం జోగుతున్నది మరొక సగం తన గాయాలకు తన నాలుకతోనే మందు రాసుకుంటున్నది అవసాన శ్వాస నుండి కొత్త ప్రాణం పుట్టుకొస్తుంటే నిలువెల్లా రగిలిన గాయాల బాధ మింగి మొండి చేతులతో పగిలిన గుండె దోనె చేసి పురిటి పాపాయిని పొదివి పట్టుకుంటున్నది. మత్తు వీడని రెండో సగానికి యూఫోరియా లోనే బ్రతుకు తెల్లవారిపోకుండా నిజం తెలుసుకోని నిప్పు కణికై భగ్గుమంటే చూడాలని వుంది భస్మం నుండి లేచొచ్చే కొత్త పొద్దు పొడుపై వెలిగిపోతే చూడాలని వుంది అందుకే గాయాలను చూసి గాజు లా మారిన నా కళ్ళను ప్రమిదలు చేసి, శ్రమనే వత్తులు వేసి, నెత్తుటి నూనెను నింపి ఆశా జ్యోతులను వెలిగించి నిరీక్షిస్తూనే వుంటానింక యెన్ని చీకటి యుగాల పర్యంతమైనా!

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hKtyxl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి