కత్తిమండ ప్రతాప్ || మానవత్వమా!|| =========================== ఎక్కడో ఓ మూల చిన్నగా హీన స్వరం ఊపిరిలాగ లేక డొక్క కదిలిస్తుంది ఆకలి కన్నా ఆవేదనే గుండెల్ని గుచ్చేస్తుంది కదిలేకాలంలో ఒంటరితనం నరాల్ని ఒడిసి పిండేస్తుంది ఆప్యాయ పిలుపుకోసం పరితపిస్తుంది దేహం! ఎక్కడో ఏసీగదిలో సేదతీరుతున్న ఓగంభీరస్వరం కన్న పేగుని పట్టించుకోని మృగ జీవిలా పెగ్గు లెగరేస్తుంది కాలం పరిగెడుతున్నా..అమ్మ కమ్మని లాలన వద్దనుకుంటూ ... ! ఎక్కడో శబ్దాలు వినిపిస్తున్నాయి రెండు వింత లోకాల మధ్య ఎడబాటు చూపుతూ పున్నమి వెన్నెల కూడా మసకేసింది నల్లటి దుప్పటి ఆకాశాన్ని కప్పేసింది రవ్వంతైన వెలుగు లేకుండా చిల్లులు పడిన లోకం మానవత్వాన్ని చీకట్లో కలిపేస్తుంది కేకలన్ని అరణ్య రోదనలై వెక్కిరిస్తున్నాయి జన్మ నిచ్చిన అమృతమూర్తి భారమౌతుంది అందుకే కాబోలు భూమి బద్దలవుతుంది జనని వేడెక్కుతుంది కనిపించని గాయాలు గుండె పొరల్లో దాక్కున్నాయి దాగని వేదన ఉబికుబికి లావాలా తన్నుకొస్తుంది డొక్కలో అదిమి పట్టే బాధ పెదాలపై గేలి చేస్తుంది అంతా శూన్యం ... ఎక్కడో మూగబోయిన పిలుపు కన్నాల్లోనుంచి తొంగి చూస్తుంది భళ్ళున తెల్లారే జీవితాలు చీకటి వైపే పయనిస్తున్నాయి కాలంపై కాలకూట విషం ఉమ్మేసింది చిద్రమైన లోకంపై చిమ్మేసింది మానవత్వాన్ని అమ్మేసింది ================== మే 25/2014
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mbhuCH
Posted by Katta
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mbhuCH
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి