పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మే 2014, ఆదివారం

Yessaar Katta కవిత

సురెక||తెలుగు గజల్ -5 .. దేశప్రేమ పెంచితే ప్రగతిని నిలబడి చేరినట్టే కులపిచ్చి పంచితే దుర్గతికి కలబడి పోరినట్టే. .. కాలేపేగుకు కూడు యింత దొరికితే ఆకలి మంటకు ఇక సెగవడి తీరినట్టే. .. కవి లోచనకు భావం యింత దొరికితే పాళీనడకకు ఇక బలువిడి కూరినట్టే. .. చెలిమనసుకు రాగం యింత దొరికితే మది ఊసుల్లో ఇక అలజడి దూరినట్టే. .. ప్రేమదోయికి వలపు యింత దొరికితే అధర పలుకుల్లో ఇక అలికిడి జారినట్టే. .. దీపవల్లికి తైలం యింత దొరికితే కాంతి సుధలకు ఇక నిలకడ చేరినట్టే. .. (తెలుగు గజల్-25/05/2014)

by Yessaar Katta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h1WUrl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి