పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మే 2014, ఆదివారం

Rajender Kalluri కవిత

## స్నేహం ## వయసు బేధం లేదు నాకు ఎక్కడంటే అక్కడ విహరిస్తాను ఎవరి మధ్య అయినా చిగురిస్తాను ప్రతి వాళ్ళని పలకరిస్తాను నా నుంచి ప్రేమ మొదలువ్తుంది. నాకంటూ ఓ ఆస్థానం లేదు గాని ప్రత్యేక స్థానం మాత్రం ఉంది కల్మషం లేని నా స్వభావాణ్ని అడ్డుగా పెట్టుకుని కలుషితమైన వ్యాపారం చేస్తున్నారు కదూ విలువలు లేని వీధిలో మీరు బ్రతుకుతున్నా , వాటిని తెలుస్కోలేని మీ మధ్య నేను బ్రతకలేను అందుకే ప్రపంచ వీధులన్నింటిలో నేను సంచరిస్తున్నా , అతి కొద్ది మంది మధ్యలో మాత్రమే స్వేచ్చగా జీవిస్తున్నా ఆ స్వేచ్చా జీవితాన్ని అందిస్తున్న వారందరికీ నా “ ఈ రోజు “ ని అంకితం చేస్తున్నా . ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ .... నేను విహరించే వీధి ని “ స్నేహం “ అంటారు నన్ను అక్కున చేర్చున్నవారంధరిని “ స్నేహితులు” అంటారు నేనే ప్రాణం అని అనుకున్నవారందరిని “ గొప్ప స్నేహితులు “ అంటారు ! kAlluRi [ 25 - 05 - 14 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m9ov6V

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి