??? ||జాన్ హైడ్ కనుమూరి|| నీ శ్రమవున్నంత మాత్రాన ఈ రహదారి సొంతమేమీ కాదు కొందరు ముళ్ళను నరుక్కుంటూ కాలిబాటలో నడిచివెళ్ళారు కొందరు కంకరరాళ్ళను పరచుకుంటూ ఎడ్లబళ్ళను తోలుకెళ్ళారు దోచుకున్న సంపదను తరలించేందుకు చెమటచుక్కల ఇందనాలతో రోడ్డురోళ్ళను నడిపారు కొందరు ఊరు నాల్గక్షరాలు నేర్చాక కాలిబాట రోడ్డయ్యింది నాచుట్టూ పరుచుకున్న విషవలయంలో ఊర్లోని రోడ్డు ఊరుమీదనుంచి రహదారిగా మారింది నేనింకా తొక్కాలనుకునే సైకిలికిప్పుడు ఆ రహదారిపై అనుమతిలేదు నా ఊరిదేహభాగమైన రహదారిపై కారు నడపాలంటే, బస్సెక్కివెళ్ళాలంటే పన్నుచెల్లించాల్సిందే! * * * కాలిబాటకు కాలంలో ఎన్ని మార్పులు * * * అంతర్జాల ప్రయాణంలో మార్పువెంట మార్పులు నాదైనదేదీ నాది కాదు *******************25.5.2014 6:00 - 7:25 pm ISD
by John Hyde Kanumuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oh6f0u
Posted by Katta
by John Hyde Kanumuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oh6f0u
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి