పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మే 2014, ఆదివారం

Abd Wahed కవిత

దొరికిందొక జీవితమిది ఎలా ఉన్న బాధ లేదు విషాదమే సంపదైతె తక్కువున్న బాధలేదు అనుభవాల పాఠాలను చదువుకునే తరగతిలో మోదమేదొ ఖేదమేదొ తెలియకున్న బాధలేదు అగ్నిధారగా మారని అక్షరాలు అవసరమా లోకాలను ముంచే కన్నీళ్ళున్నా బాధలేదు ఇరుకు ఇరుకు మనసైతే ప్రేమలకిక చోటెక్కడ మర్యాదల పూలవాన కురియకున్న బాధలేదు శలభాలే కరువైతే దీపాలకు పనేముంది ముల్లులాగ పెనుచీకటి గుచ్చుకున్న బాధలేదు దిగ్మండల సుందరాంగి దరహాసం తొలిపొద్దుకు ముత్యాల్లా కిరణాలే రాలుతున్న బాధలేదు గడిచిపోయె ప్రతిరోజూ ఒకనష్టం బతుకులోన లాభాలకు దియా లెక్క లేకున్నా బాధలేదు

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pmYdAk

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి