గ్లోబలైజేషన్ పల్లెకి దూసుకొచ్చి ఫ్యాషనైజేషన్ వెదజల్లాక పచ్చని పొలాల్లో పరభాష సాగయ్యాక.. మాతృభాష మనుగడ లోపిస్తోంది.. ధాన్యంలో బెరుకులు బియ్యంలో మెరిగలుగా ఉన్న ఆంగ్ల పదాలు ఇపుడు అన్నంలో రాళ్ళవుతుంటే తెలుగుభాష తియ్యదనం తగ్గుతోంది.... సొంతభాషకు సోకిన తెగులు వదలాలంటే అక్షరాలకర్షకులు అభినవ హాలికులు కలాల హలాలు ఎక్కు పెట్టాలి సాహిత్య సంపదలుసాగు చేయాలి..
by Kancharla Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jiqyFz
Posted by Katta
by Kancharla Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jiqyFz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి