పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Srinivas Saahi కవిత

*పాత పాటే..* ప్రయత్నం పాయఖాన మీదే కూర్చుండిపోయింది దిక్కులేని తనం వెక్కిరించి ధిక్కరించి నా ప్రయత్నమొక పనికిరాని విరేచనమయింది అజ్ఞాతాన్ని కాలి కింద తొక్కి పెట్టి దాని మొహాన ఓ అగ్గిపుల్ల గీకి పడేద్దామనుకున్నా! అలాగైనా వెలుగు మొహం చూడొచ్చేమోనని.. కానీ.. ఎండిపోయిన తాటి చెట్టు చివరన ఉరేసుకున్న కల్లు-కుండ అవశేషంలా రోజు-రోజుకి ఎండిపోతున్న నా పిప్పిప్పీ.. పీక లాంటి మెడ చుట్టూ అజ్ఞాతం ఓ తాడు కట్టుకుని ఊయలూగుతుంటుంది ఆలోచనలంతా అతలాకుతలం-అయోమయం ఏదేమైనా నేనిలా రాసుకుని నా జబ్బ నేనే చరుచుకోవడం నాకు కాస్త ఊరట.../శ్రీనివాస్ సాహి 21/02/2014.

by Srinivas Saahi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MHPmvv

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి