పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఓటు అదొక నిండు సభ కానీ పెద్దలేరి? అందరూ పెత్తందార్లే అక్రమార్కులే ఈ రాజకీయావాకశాకాశంలో అందరూ రాబంధులే ఉన్న ఒకళ్ళో ఇద్దరో ఉన్న పలాన రంగులు మార్చే ఊసరవెల్లులే అదంతా ఒక పెద్ద భూటకం మనకి ఏదో ఒరుగుతుందని మనల్ని భ్రమింపచేయడానికి ఆడే నాటకం ఐదేళ్ళకోసారి వచ్చే ఎన్నికలు మనకి వచ్చే ఒకే అవకాశం ఓటు అంటే వ్రేలు మీద చుక్క పెట్టించుకోవడం కాదు అదొక బాణం మంచి అభ్యర్ధిని గెలిపించడానికి ప్రత్యర్ధిని ఓడించడానికి ప్రయగించే అస్త్రం మనం దాన్ని మంచిగా మడతపెట్టి బాలెట్ బాక్స్ లో భద్రంగా వేస్తాం మన బ్రతుకుల్ని మనకి తెలియకుండానే నేతలకి తాకట్టు పెడతాం వాళ్ళు విసిరే ఉచితవరాల వలలో పక్షుల్లా చిక్కుకుపోతాం ఇకనైనా కళ్ళు తెరుద్దాం మన ఓటుని సందిద్ధాం అసలు అభ్యర్ధే లేకపోతే అస్త్రసన్యాసం చేద్దాం అంతే గానీ ఓటుని మాత్రం వ్యర్ధం చేయవద్దు ఎవరికీ అమ్మవద్దు ఇది ఒక దేశ దిశ దశని నిర్ధేశించే సదవకాశం అంతే గానీ మనల్ని మోసం చేసే మనుషులకిచ్చే అవకాశం కాదు ఇప్పుడైనా కళ్ళు తెరుద్దాం మన భవిష్యత్తుని మనమే వ్రాసుకుందాం 21FEB2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oZ0jYc

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి