ఈ నేల ఎప్పుడో కోటి రతనాల వీణ మెట్లపై జారి ఘల్లున రాలిపడ్డ గమకం ఈ నేల గాయపడ్డ రెక్కలను సరిచేసుకుంటూ ఒదిగిఒదిగి ఓ మూలాన దిగాలు పడిన వెలుగు వెన్నెల నావ ఈ చిన్నారి నెమలీక ఆకలి దప్పుల కారడవుల్లో దారితప్పిన పసిపాపై అలమటించి అలమటించి శుష్కించి బీటలు వారిన జ్ఞాపకాల నీడలు ఆగి ఆగి రేగి రేగి నొప్పించే మానని ఎదురు దెబ్బలు నిమురుకుంటూ కాలం చారల సిల్కు చీర వెనకాల చిరిగినదేహాన్ని కుట్టుకుంటూ అరణ్య వాసం చేసినదీ నేల ఏళ్లకొద్దీ అణిచేసిన అధికార దాహం కింద అన్య వలసల అపరాహ్నపు విలవిలలో నీ బాంచను కాల్మొక్త దశ ఆగిపోయిన ఘడియల్లో ఆగిపోయే శ్వాసతో తుపాకులు పైకెత్తి ఎదురుతిరిగి రక్తాలోడిన దీ నేల శృ౦ఖలాలు సడలించుకు పిడికిలి బిగిస్తూ ఇన్నాళ్ళకు అశ్రుతర్పణాల అభిషేకాలతో నేల తల్లి కనురెప్పల నందన వనాలలో వినువీధిన పతాకమై నింగి కెగసినదీ ఈ నేలే. ఇది జయధ్వానాపు సన్నాయిలో సరిగమలై కురిసే తెలుగు నేల
by Swatee Sripada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MGFan4
Posted by Katta
by Swatee Sripada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MGFan4
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి