పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Srinivas Saahi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Srinivas Saahi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జూన్ 2014, బుధవారం

Srinivas Saahi కవిత

శ్రీనివాస్ సాహి*ఎక్సు-పీరియన్సు* కనీ వినీ ఎరిగి జీవితమొక ఖాళీ పూరించే ప్రయత్నం ఖాళీ మీద అడ్డంగా రెండు ఎర్ర గురుతులు పుసుక్కున పాసవడమే పాసు-పుణ్యం ఏముండదు ఛా... ఛీ... కాయితం నిండిపోయింది కాకా రెడీగా ఉండు కమ్మ మర్రేత్తన్నా... 11/06/2014.

by Srinivas Saahi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q4c8yG

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Srinivas Saahi కవిత

శ్రీనివాస్ సాహి *అమ్మ గుర్తు..* సంబురం సంతల బేరంలా గిచ్చి-గిచ్చీ గుచ్చి-గుచ్చీ ఒకింత తగ్గితే పరిచయ లేమి ప్రపంచాన్ని పచ్చిగా-పిచ్చిగా పరిచయం చేస్తుంటే నాన్న కూడా అమ్మే అయి నానార్థాలు వివరిస్తుంటే.. చిక్కు గీతల ముళ్ళిప్ప చూపి చిన్నదేరా ప్రపంచమని నన్ను పెద్దవాడిని చేసి నన్ను వెలిగించ నువ్వొక ఆలోచనా చిమ్నీవై నేనారిపోతున్న ప్రతీసారి అత్మీయపు చమురువై అరువులైనా బరువులైనా అలసిపోయిన ఆ కండ్లళ్ళ నాదనే స్వార్ధమే అమ్మా!..... 11/05/2014.

by Srinivas Saahi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nwaJ2U

Posted by Katta

19, ఏప్రిల్ 2014, శనివారం

Srinivas Saahi కవిత

శ్రీనివాస్ సాహి,*తాజా వార్త...* ఎలిసిపోయిన నీ తెల్ల టోపీకి చెమట పట్టుకున్న నా ఎర్రబొట్టుకి పచ్చబొట్టసొంటి సాయితా... పెరుగుతున్న బ్రతుకు రేటులో మన విలువ ఎప్పుడూ పది పైసలు పతనమవుతుంటుంది గూడొక్కటే వేరు బ్రతుకు పోరు ఇద్దరి మధ్య బరాబరే! బ్రతుకు రోడ్డు మీద ఎన్ని గతుకులున్నా.. భాయిజాన్! మనిద్దరి జబ్బలు-జబ్బలు రాసుకునే తిరుగుతాయి అప్పుడెప్పుడో చదివిన వార్తల్లోల్లాగా మనమింకెప్పుడూ అమాయకుల్లా మిగిలిపోవద్దు అందుకే.. అక్కడ అధికారం కోసం సన్నద్ధమవుతున్న వాడి మొహం మీద నా అక్షరాలతో నిసురుతున్నా ఒక "థ్పూ..." పాత వార్తనే మళ్ళీ తాజాగా ప్రకటిస్తున్నా.. ఇక్కడ అందరి కలల ప్రపంచమొక్కటే అందరి దేశమొక్కటే "భారతీయులందరం ఒక్కటే" 19/04/2014.

by Srinivas Saahi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qXQGZV

Posted by Katta

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Srinivas Saahi కవిత

*పాత పాటే..* ప్రయత్నం పాయఖాన మీదే కూర్చుండిపోయింది దిక్కులేని తనం వెక్కిరించి ధిక్కరించి నా ప్రయత్నమొక పనికిరాని విరేచనమయింది అజ్ఞాతాన్ని కాలి కింద తొక్కి పెట్టి దాని మొహాన ఓ అగ్గిపుల్ల గీకి పడేద్దామనుకున్నా! అలాగైనా వెలుగు మొహం చూడొచ్చేమోనని.. కానీ.. ఎండిపోయిన తాటి చెట్టు చివరన ఉరేసుకున్న కల్లు-కుండ అవశేషంలా రోజు-రోజుకి ఎండిపోతున్న నా పిప్పిప్పీ.. పీక లాంటి మెడ చుట్టూ అజ్ఞాతం ఓ తాడు కట్టుకుని ఊయలూగుతుంటుంది ఆలోచనలంతా అతలాకుతలం-అయోమయం ఏదేమైనా నేనిలా రాసుకుని నా జబ్బ నేనే చరుచుకోవడం నాకు కాస్త ఊరట.../శ్రీనివాస్ సాహి 21/02/2014.

by Srinivas Saahi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MHPmvv

Posted by Katta