పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Padma Rani కవిత

!!నేనే నా సైన్యం !! అంతరంగ మధనమే నమ్మిన నా అంగరక్షకుడిగా నియంత్ర భావావేశాలే కాపాడే కవచకుండలాలుగా ఆలోచనా ఆయుధాలెన్నో అంబులపొదలో దూర్చి ఆగి అడుగేస్తు సంధిస్తున్నా అస్త్రాలను ఆచితూచి నవ్వు మాటున దాగిన వేదనలే నా గూఢాచారులు ఆత్మస్థైర్య, శ్రమ ఫలితాలే నా ఆయుధకోశాగారాలు నింగికెగసిన ఆశయాలే చేరుకునే లక్ష్యాలుగా మారి నిలబెట్టి నిలేస్తున్నాయి నిశ్చల సిపాయిలుగా చేరి సాహసమే ఊపిరంటూ సహాయపడే సలహాదారుడు సాధ్యంకానిది లేదంటూ సాగిపోమనే సైన్యాధ్యక్షుడు సహనాన్నే కాలంపై సంధించబోతున్నా చివరాస్త్రంగా ఎడతెరపిలేని జీవితరణం చేస్తున్నా నేనే నా సైన్యంగా 21-02-2014

by Padma Rani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTmN8V

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి