తిలక్/నీ/స్వార్థం ---------------------------- ఆకాశంలో ఒక సరళ రేఖలో పయనిస్తున్న కొన్ని పక్షులు ఒకరి భారాన్ని మరోటి మొస్తున్నట్టు కొన్ని నిశబ్దాలను శూన్యంలో వింటున్నట్టు భూమికి సమాంతరంగా నీలంలో నిగూడంగా నువ్వు నీ కళ్ళతో వాటిరెక్కలపై చూపులనద్దుతుంటావు చూడు సహృదయుడివైనట్టు కొద్దిసేపట్లో వాటిని కళేభరాలుగా మారుస్తావని తెలియక నిన్ను నమ్ముతాయి మూగగా మాట్లడుతూ దోసిళ్ళలో నింపుకున్న కొన్ని కీచక ప్రేమలేవొ కురిపిస్తుంటావు పడబోతున్న మాంసపు ముద్దలను ఒడిసిపట్టుకునేలా..... తిలక్ బొమ్మరాజు 21.02.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hBPmLi
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hBPmLi
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి