పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Sistla Madhavi కవిత

(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...మాతృభాషా వైభవం అనే స్వీయ కవితా సంపుటి నుండి) 21-2-14. దేవ భాష. శిష్ట్లా మాధవి. వింటె భారతమ్ము వినాలి తింటె గారెలె తినాలి పలుకంటె మాతృభాషలోనే పలకాలి మెరుపంటి వెలుగు కంటి వెలుగంటి తెలుగు చెరుకంటి తీపి తెలియాలంటే తెలుగు కనుకనే తెలుగు కలువలరేని వెలుగులంటి తెలుగు వీణియ రాగమంటి తెలుగు ప్రతి మది వీణియ మీటే తెలుగు తెలుగు తెలుగంటూ పలుమార్లు పలికిన తెగని రాగమై సాగే వెలుగు రాగమే తెలుగు శివుని జటాజూటమునుండి జారి పడు గంగా ఝరి తెలుగు తల్లి భారతి వీణానాద తరంగమీ తెలుగు బ్రహ్మ వేదముల నాదమ్మీ తెలుగు శ్రీమాత చిద్విలాస లాస్యమ్మీ తెలుగు సంగీత,సాహిత్య సముచిత వికసిత పద్మ సౌరభమ్మిది దేవభాషయన్న వేరొకటి లేదు ఎవరి మాతృమూర్తి వారి దేవతామూర్తి అయిన యట్లు ఎవరి మాతృభాష వారి దేవ భాషయేగా- 21-2-14. శిష్ట్లా మాధవి.

by Sistla Madhavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d94w3g

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి