మోహన్ రుషి // నేర్చుకోవాలి! // షేరింగ్ ఆటో గుండా ప్రయాణిస్తాం. మరో రోజులోకి. మళ్ళీ ఆ బ్రతుకు అరణ్యంలోకి. మనం అటెండ్ చెయ్యక తప్పని మనుషులలోకి. డెక్ లో పాట. "అమ్మా తెలంగాణమా, ఆకలికేకల గానమా...", నిరంతరాయంగా. ఏండ్లుగా డొక్కలో సుళ్ళు తిరుగుతూ. ఎక్కడెక్కడి యాదిల్లోకి లాగుతూ. అమ్మలు కూర్చున్నారిద్దరు ఎదురుగా. "పవుతు నా తిండి, నా తాగుడు, ఎన్నడన్న పక్కోనికి పైస పెట్టినాడె?!". "ఎవని పాపాన వాడే పోతడక్కా. దావ్ ఖానల పడ్డప్పుడు మనమైతె మందలిచ్చి రావాలెగద?". ప్రేమైకమూర్తులు. సాయిబాబా గుడి దగ్గరి గుంతల్లో ఆటో కిందామీదా అయినప్పుడు, "రోడ్డు సల్లగుండ" అంటూ, కోపంలోనూ నోరు జారని వాళ్ళు. పాఠాలు తెలియనివాళ్ళు. పాటలను మించినవాళ్ళు. ఏమి కావలె, ఇక ఈ సమయానికి, జీవితానికి? పై గుండీ విప్పి, అంగీ వెనక్కి లాగితే, తగిలే చల్లని గాలి చాలు. 25.9.2013 ("జీరో డిగ్రీ" నుండి)
by Mohan Rishi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ohw9BP
Posted by Katta
by Mohan Rishi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ohw9BP
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి