శూన్యానికి దూరంగా ______________అరుణ నారదభట్ల జీవితం ఎప్పుడూ ప్రశ్నార్థకమేనేమో! ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలుసూ... పుట్టి బుద్ధెరిగినప్పటినుండీ మొదలయ్యే ప్రయాణం! ఎన్ని...కలలు...ఎన్నెన్ని కహానీలూ అన్నీ నెరవేరేవేనా...?! కొన్ని చేతిలో ఉండేవి... మరికొన్ని ప్రయత్నించినా దక్కనివి! ఎప్పటికప్పుడూ రంగుల దుస్తులు ధరించినట్టు తెల్లారే సరికల్లా మరో కొత్త ఊహ మదిని మేల్కొలుపుతునే ఉంటుంది! నేనూ..నేనూ అంటూ వేసే ప్రతి అడుగూ ఓ సంచలనం అవ్వాలని ఎన్ని నిద్రలేని రాత్రులు తపిస్తామో! ఆకాశపు చివరన నిలబడినా ఆశమాత్రం చావదు నీటిలో వేసిన కాగితపు పడవలా కాలంతో పాటుగా కదిలే ప్రవాహంలో మునిగిపోతూ కూడా పరుగెడుతూనే ఉంటాం! నిజాలు అబద్ధాలుగా...అబద్ధాలు నిజాలుగా కావలసింది దక్కక...దక్కినది వద్దనుకోలేక దృవాల దగ్గరి వెలుతురులై అప్పుడప్పుడూ ప్రకాశించే గెలుపు గుర్రాలు మనసును ఊరట పరిచినప్పుడు మళ్ళీ నాలో నేనుండను! ఏ పూలపల్లకో నాకోసం ఎదురుచూసినట్టు వెన్నెల వర్షం ఎడారిపువ్వై విరిసినట్టు దివిటీలాంటి అఖాతంలో నెగ్గడం చిరుదీపమె అయినా చివరివరకూ పోరాడటానికి అదో వింతవెలుగై కదలాడుతూనే ఉంటుంది కరిగే కాలానికి ధీటుగా ఈ కలబోతలో ఇంకెన్ని రంగులు పులుముకునేదుందో మెరిసే ఇంద్రధనుస్సులా!! 21-2-2014
by Aruna Naradabhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oYXtCA
Posted by Katta
by Aruna Naradabhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oYXtCA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి