పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఫిబ్రవరి 2014, గురువారం

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ || జ్ఞాపికలు - శ్రీశ్రీ మాటల్లో || 1. ఇవాళ కవిత్వం రాయాలంటే ఉత్సాహం ఒక్కటే చాలదు. విప్లవ చైతన్యం కూడ కావాలి. ఈ చైతన్యం '' మార్క్సిస్టు సిద్ధాంతంతో వెలిగించబడినప్పుడే కవిత్వం ఉన్నతో్న్నత శిఖరాలనందుకోగలదు '' (విప్లవం వర్థిల్లాలి కవితా సంకలనం - ముందుమాట 8.2.1972) 2. కళ్లకు కట్టే విధంగా దృశ్యాలను చిత్రించడం ఒక్కటే కవికి లక్షణం కాదు. అతని భావవాహిని సవ్యమైన మార్గాలు పట్టిందా లేదా పెడ దారులు తొక్కిందా అన్నది కూడ ఆలోచించవలసిన విషయం. ఈ విషయంలో గురజాడది సంపూర్ణమైన ప్రగతి దృక్పథం. (ముత్యాల సరాలు సపుటికి పరిచయం - జూలై 1958) 3. '' మాత్రా ఛందస్సులో, వాడుక భాషలో నేను మొట్టమొదట రాసిన గేయాల్లో మొట్టమొదటిది '' నేను సైతం '' దీని ఛందస్సు ముత్యాలసరం. ఆ చందస్సులోల్ని ఒకటి రెండు పాదాలతోనే ఎంత వైవిధ్యం సాధించ వచ్చునో తెలుసుకున్నప్పుడు నాకాశ్చర్యమూ, ఆనందమూ కలిగింది. వైజ్ఞానికుడు ఒక కొత్త సత్యం కనిపెట్టినపుడు పొందే సంతృప్తి అప్పుడు కలిగింది '' - శ్రీశ్రీ 4. '' రచనకు ముందు రచనా నిబంధనలతో గింజుకోవడం మంచిదికాదు. ఈత నేర్చుకోడానికి మార్గం సాహసించి నీళ్ళలోకి దూకడమే. అసలు రహస్య మేమిటంటే ఎంత చేయి తిరిగిన రచయితైనా అలా రాయాలో చెప్పలేడు. '' ( శ్రీశ్రీ - వారంవారం వ్యాసక్రీడలు ) 5. '' కథలో, కవితలో ఊహాగానం వద్దు. నాటకాలలో మితిమీరిన కల్పన చేయొద్దు. నేటి సమాజం, ఆర్థిక వ్యవస్థ పరిస్థి్తుల దృష్ట్యా వాస్తవిక దృక్పథంతో రచనలు చేయాలి. రచయితలపై సమాజపు ప్రభావం అనివార్యంగా వుంటుంది. '' ( కొత్త కెరటం - శ్రీశ్రీ ఉపన్యాసాలు) 6. '' కాలానుగుణంగా ఛందస్సు మారుతూ వుంటుంది. ఛందస్సు కవిత్వం కాదు. కవిత్వానికి ఛందస్సు వాహనం. వాహనం అనేక రీతులు '' (కవిత్వమూ, ఛందస్సూ - 24.10.69 తెలుగు వార పత్రిక) 7. '' కవి ధరించాల్సింది కలమా? ఖడ్గమా? అనే ప్రశ్నకు కలమే అని జవాబివ్వటం చాల సులభం. కాని ప్రతి జాతి జీవనంలోనూ ఒక్కొక్క పరీక్షాసమయం వస్తుంది. అప్పుడు కవి అన్నవాడు కలం పరేసి కత్తిని ధరించవలసిందే (అనంతం - శ్రీశ్రీ) _________________________________ (శ్రీశ్రీ సాహిత్యనిధి సౌజన్యంతో ) _________________________________ 20-02-2014 ఉదయం 10.00

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUJJA4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి