పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఫిబ్రవరి 2014, గురువారం

Thilak Bommaraju కవిత

My poem at saranga... తిలక్||నువ్వు మళ్ళీ -------------------- కొన్ని సంభాషణల వల్లో మరిన్ని సందిగ్దాల వల్లో నిన్ను నువ్వు కొత్తగా రాసుకోడానికి యత్నిస్తుంటావు చూడు... అప్పుడే రాలిపడుతున్న పక్షి రెక్కల్లాగా బొడ్డుతాడుతో కుస్తీ పడుతూ గర్భాశయంలో అప్పటిదాకా పాతుకుపోయిన తనని తాను లోకానికి పరిచయం చేసుకునే మాంసపు ముద్దలా నువ్వుహించుకున్నపుడు నిన్ను మరచి నీది కాని స్తన్యంలోకి ఆబగా చొచ్చుకుంటూ వడగళ్ళ దాహార్థిని మునివేళ్ళ సందుల్లో బందిస్తూ పసిపిచ్చుక తపన అప్పుడనుకుంటావు నీకునువ్వుగా ఏదో సాదించావులే ఈ వెదవ జీవితాన ఎందరో మనసులకు అంత్యక్రియలు జరిపినతరువాత చినుకుల్ని లెక్కెడుతూ మబ్బుల్ని తోసేస్తూ దొరికిన కూసింత స్థలంలోనే ఆరడుగుల స్వార్థ పీలికలను ఒక్కొక్కటిగా నీలోకి చేర్చుకుంటూ ఒదిగిపోతావు మళ్ళీ నీలోకి నిన్ను దాచేస్తూ.... తిలక్ బొమ్మరాజు 10.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eWat3c

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి