కవి అంటే ఎవడు? poem by GOREY SAIF ALI \u003C3 కవి అంటే ఎవడు రెక్కలున్న పక్షిలాంటోడు ఆఫ్రికాలో చెట్టైనా ... అమలాపురం లో కొమ్మైనా తనదే అనుకునే వాడు . కవి అంటే ఎవడు సరిహద్దురేఖలను పట్టించుకోకుండా... చల్లని వెన్నెలకన్నా గోప్పదైనాదేదో ప్రపంచానికి ఇచ్చేవాడు. . కవి అంటే ఎవడు పుట్టిన చోటనే బురదగుంటలా ఉండి పోకుండా పాయలు పాయలుగా మారి నలువైపులా పచ్చదనానికి జీవం పోస్తూ పారే జీవ నది లాంటోడు . . కవి అంటే ఎవడు ? ఏ రంగు తుమ్మేదవాలినా లేదా ఏ వర్గపు చచ్చిన మనిషి శవం పైన ఐనా తన పరిమళం లో మార్పు రానటువంటి సుకుమారమైన పువ్వులాంటోడు. . కవి అంటే ఎవడు ఒక ప్రాంతానికి రాజు లా కాకుండా ప్రతి పాపాయికి నచ్చే ఆకాశం లో తారలాంటోడు. . కవి అంటే ఎవడు? ప్రాంతాలను పట్టించుకోకుండా ఎక్కడ ప్రేమ లభిస్తే అక్కడ తన హృదయాన్ని వర్షించే మేఘం లాంటోడు. . కవి అంటే ఎవడు మెదడుకి గుండేకి మధ్యలో మంచి రక్తాన్ని మోసే నరం లాంటోడు. . కవి అంటే ఎవడు? ఎంతో మంది బాటసారులకు లక్ష్యానికి చేర్చే రహదారి చౌరస్తా లాంటోడు. . కవి అంటే ఎవడు ? చినిగిన అమ్మ చీరను అతుకులు వేసే సూది లాంటోడు. . కవి అంటే ఎవడు ? సీసానుంచి బయటకు రాగానే అనంతమయిన గాలితో కలిసి అనంతుడిగా మారిపోయే అత్తరు లాంటోడు. . కవి అంటే ఎవడు? మనసులని కలిపే పెదాలపైన చిరునవ్వులాంటోడు. . కవి అంటే ఎవడు? మనుషుల్ని కలుపుకుంటూ మనుషుల్లో మనిషి గా బతికే దేవుడు
by Saif Ali Gorey Syed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eXML6F
Posted by Katta
by Saif Ali Gorey Syed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eXML6F
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి