గుబ్బల శ్రీనివాస్ ।। ప్రేమ గాయం ।। ------------------ ఈ నేలంతా ముల్లెప్పుడు మొలిచాయి ? నేను చేరేదెలా ఆవలికి ? ఆ నివాసంలోనే కదా నా హృదయం వుండేది దాన్ని విసిరేసారా .. !? చిదిమి పారేసారా .. !? ఇప్పుడు దాన్ని వెలికితీసే సత్తువ ఎవరిస్తారు నాకు ? మరిచిన ఆ మనిషా ? విరిచిన ఆ మనసా ? వసంత కాలాలన్ని పచ్చని ఎడారులేనా !? వెన్నెలవొలికి పాలు పారబోసుకున్న రేయిలన్నీ అమావాస్య చీకట్లేనా !? నీ కురులు వర్షపు నీటిలో కదలాడే శ్రావణమేఘాలు కాదా !? నన్నుముంచే జడివానా !? మరైతే నా మనసెందుకు అలా తలచింది ? ఇలా వగచింది. విరికన్నెల పలకరింతలన్నీ భూటకమేనా ? వెండివెన్నెల కాంతులన్నీ బ్రాంతియేనా ? నువ్వు కోరుంటే నా హృదయాన్ని నీ కసికి .. ఒక్కొక్క ముక్కగా కోసిచ్చేవాన్ని నువ్వు అడిగుంటే నా ఆకరి రక్తంబొట్టు వరకు పిండి రక్తతర్పణం చేసుండేవాన్ని కదా ! సుమన సుందర రాగాలన్నీ మరణమృదంగ .. గీతాలుగా ఎందుకు మార్చావు ? నా బ్రతుకంతా చితిమంటల .. మృత్యుధ్వనులతో ఎందుకు పేర్చావు ? నన్ను చిత్రవధ చేసేందుకు సున్నితమైన మనసుని శిలగా మార్చుకోకు పవిత్ర ప్రేమను బలిగా చేయకు ! (20-02-2014)
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kZYPg0
Posted by Katta
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kZYPg0
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి