నిద్ర నా పెద్ద కొడుకు వేదశీర్ష్ (ఇంటర్ సెకండియర్)రాసిన కవిత) చలి అనే దుప్పటి తోడైతే నిద్ర బండి టాపుస్పీడుతో దూసుకెళ్తుంది రగ్గు దానికి ఆక్సిలరేటర్ ప్రియమైన కలలే దానికి పెట్రోలు పీడకలలు హాల్టింగ్ స్టేషన్లు సమయానికి బ్రేక్ వెయ్యకపోతే నిద్రపోతు పేరే జీవితానికి పెద్ద ఆక్సిడెంట్ చిన్నపిల్లాడికి అదొక వరం బడిలో విద్యార్థికి అదొక అపరాధం. యువతకు అదొక శాపం ఎంత నిద్రపోయినా ఇంకొంచెం సేపు పడుకో అని మనసుతో పలికిస్తుంది. నిద్రపట్టని నాడు మాత్రం ప్రతిక్షణం ఒక కాళరాత్రవుతుంది. నార్కోటిక్ ల కన్నా పవర్ ఫుల్ మత్తుమందు నిద్రే పనిలేనివాడికి అదొక సుఖయాత్ర పనిముందుంటే అదొక భయంకర స్వప్నం అలారం క్లాకుల్లాంటి పదునైన ఆయుధాలైనా దానిముందు వెనక్కి పోవాల్సిందే తపనతో ఉన్న మనస్సే దాన్ని మట్టుపెట్టగల ఏకే 47 నిద్రబండిని మేనేజ్ చెయ్యడానికి డ్రైవింగ్ స్కూల్లుంటే బాగుండు నిద్రబండిని సరిగా తోలేవాడు కాలాన్ని జయించినట్టే! అందరికీ అవిరామ నిద్ర దొరికేది జీవితం ఆఖరుకే!
by Boorla Venkateshwarlu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKba4x
Posted by Katta
by Boorla Venkateshwarlu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKba4x
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి