బస్సెక్కుతూ వానపడుతుందెల్లునాన్న అంటే రాలిపడ్డ చినుకులన్నీ వానవేం కాదన్నావ్ కొన్ని జననాలు , మరణాలూ , ఇంకొన్ని కారణాలు కనుగుడ్డుమీద పురుడేసుకుని జర్రున జారిపడతాయన్నావ్ నేన్నవ్వి తత్వమా అని ప్రశ్నిస్తే తలెత్తి చూసిన నీ కళ్ళలో కన్నీరవుతున్న సందర్బాలు అపుడు నిన్ను చూస్తే నాకు మాటరాదు నీలాగ కన్నీళ్ళూ కారవు ఉబికి వస్తున్న దుఃఖమంతా దాచేసి గొంతులో ఉంచుకుని గుటకలేస్తాను కనీసం ఒళ్లన్నా తుడవని నన్ను మాయతడితో ఎత్తుకున్నాక ఏమనిపించిందీ అనడిగాను ఇంకా దానికి సమాదానంగా ఏళ్లకొద్దీ ఏడుస్తున్నావ్ మొన్నీమధ్య కన్నాలమ్మ చెట్టు దగ్గర బొట్టెట్టి సాగనంపుతూ సంతోసాలూ దుఃఖాలు సమానమని చెప్పింది ఇన్నాక బాదేంలేదు నాన్న అంటుంటే , మళ్ళీ పుట్టానని ముద్దెట్టుకున్నావు మరణాలు మనం మరువలేం ఈ పూట దుఃఖానికే కాదు బాగుండి నవ్విన పతిసారీ నీ ఉనికి చేత నాకళ్ళలో నీల్లొస్తాయి (పొద్దున్న పోన్జేసి ఒక ఆత్మ శాంతించి సరిగ్గా రెండేళ్ళు కదా, ఇవ్వలంతా నవ్వుతుండ్రా అన్నాడు. కృష్ణవేనికి నివాళులిచ్చేసాడని అర్ధమై నవ్వేసాను ) 20/02/2014
by కాశి గోవిందరాజు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jeVeYs
Posted by Katta
by కాశి గోవిందరాజు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jeVeYs
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి