పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మే 2014, గురువారం

కొనకంచి లక్ష్మి నరసింహా రావు కవిత

వీలునామా అమ్మా... శరీరం మీద తెల్లవారని కాళరాత్రులని భరిస్తున్నట్లు ..మీరు గుందెల్లో అంటుకున్న చితితో బరువుగా...బాధగా.... చావు శ్వాస పీలుస్తుంటారు. మున్నూట అరవై రొజులూ పస్తులున్నాక ఒక్కరొజు ..విందు భొజనం పేరుతో సజీవంగా తద్దినం పెట్టి .... స్వాతంత్ర్యాన్ని ..నిశ్శబ్దంగా ముక్కలుగా నరికి,రక్త మాంసాల్ని ..మందులో నంజుకుంటున్న ఈ దెశం లో కన్నతల్లి చనుబాలు నా కందకుండానే దొపిడీ చెసి....మూతి తూడ్చుకునే ఈ క్రూరాబందుల రాజ్యం లో ఓటు నోటుకు పక్క వేస్తుంది. ఆనొటు మీ శీలం మీద పది దొర్లుతుంది …. అమ్మా ..నాకు తెలుసు మీరు కార్చిన కన్నీళ్ళే మూడు వైపులా ఈ ద్వీప కల్పం చుట్టూ సాగరాలై రోదిస్తున్నాయని.. ప్రజలు కార్చిన కన్నీళ్ళే ..జీవనదులై మీ అస్రు జలధిలో సంగమిస్తున్నాయని .. ఎం చెయ్యను ...చెప్పండి. .. పుట్టుకతో కర్మ సిద్ధాంతాన్ని కల్తీ సంస్కుతిని ..తిని పెరిగిన అంట్ల వెధవాఇని మాత్రు భూమి పీక మీదుగా అశోకుని ధర్మచక్రం ..నదిచి వెల్తున్నా వేదాంతం మాట్లడే ...తిరుగుబాటు తెలియని బానిసలకు పుట్టిన ...పుట్టు వారస బానిసుణ్ణి ఏమెచెయ్యకుండా అన్నీ చెస్తున్నాననే భ్రమా పూరిత ప్రభుత్వంలో.. ప్రజలని..వెంటాడి..వెంటాడి వేధించి..వేధించి.. దొంగ దెబ్బలు కొట్టే రాజ్య పాలనలో.. గుండె నిండా ..ఆసని గుర్రపు డెక్కలా పాతుకొని ... మింగ మెతుకు లేకున్నా .. సంపెంగాలొచనలతొ బ్రతుకుతూ ఇన్నాళ్ళూ నా యవ్వనాన్ని వ్రుధాగా పారబోసాను ,...... ఇప్పుడలాకాదు.. అమ్మా.. నా శరీరంలోని ప్రతి రక్తపు బొట్టును మీ అరి చెతుల్లొ గొరింట్తాకుగా ..దిద్దేందుకు .. నా తనువులోని అణువణువును.. ఒక్కొ ..మేకుగా చేసి .. ఈ దుష్ట వ్యవస్థను ..పట్ట పగలు శిలువవెసి యావత్ ప్రపంచానికి ఆదర్శంగా .. ఎవరెస్ట్ మీద ప్రతిష్టిస్తాను ... ప్రతి మనిషి గుండెల్లో అంతుకున్న అదవి గెరిల్లానై దాక్కోని తూర్పు దిక్కుకు వంతెనగా నిలుస్తాను….. .అమ్మా..ముప్ఫై ఆరెల్ల ఈ అస్ట వక్రచరిత్రను త్రివిక్రముణ్ణై ... పాతాళానికి తొక్కెందుకు అసాంతి జీవుల తలల్లో తొలికొడై కూస్తున్న నా ఈ కలం తో ఈ భ్రష్తున్నర .. భ్రష్తు వ్యవస్థకి.. పాడె కట్టి రాస్తున్నా తుట్ట తుదకు ఈ వీలునామా …………………. 1983 డిసెంబర్ 5 ఆ ప్రాంతంలో ఆరొజుల్ని చూసి రాసిన ఈ కవితని.. .. ఇప్పటి రోజులకి అన్వైంచుకుంటే ఎలా వుందో మీరే చెప్పాలి అశ్రువు ............సమతా రచైతల సంఘం బహుమతి పొందిన కవితా సంపుటిలొంచి

by కొనకంచి లక్ష్మి నరసింహా రావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R2zGVU

Posted by Katta

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట -7 ___________________ఆర్క్యూబ్ పండ్ల దావకాన చిలుకూరి గుడైద్ది మౌత్ మిర్రర్ ,ప్రోబ్ లు ప్రత్యక్షమైతై డ్రిల్లింగ్ ఫిల్లింగ్..కొత్త మంత్రోచ్చారన రూట్ కెనాల్ లో పడి కొట్టుకుపోతం డెంటల్ కేరిస్,జింజివైటిస్ లో తేరుకుంటం మెటల్ పల్ల మోకా నడుస్తుంటది పండ్లు లేని నాగరికత పండ్లిగిలిస్తది దేహ పుస్తకం మీద గాలి మల్లి పండ్ల అద్యాయం తలుక్కుమంటది చైనాకు ఆటూ ఇటు మన ఇంటి ముందరే బ్రష్ ల చెట్టు రోజు రోజు కు దానం చేసె అదొక రంంతి దేవుడు తలచు కొంటెనె అదాయం పన్ను కలిసి వస్తది పెయ్యికి పెద్దర్వాజ మౌనం తాళం కప్ప ఎట్ల తెరుచుకోవాలి "ఈ" ఈ"కీ" ఎప్పటిదో అనుము చెడ్దది చిన్న చెక్కలగులచాలు ముఖం సూర్యుడు డైద్ది ముప్పైరెండు గుర్రాలు మెరుపు లెక్క కదులుతై అమ్మా అని పలికితె అవి మీటని వీణలు ఉండయి బండ గుండె లోనూ పాలు పొంగుతై నోరు .. ఒత్తిడిని వెలిగక్కె దేహ పొగగొట్టం హ హ హ అది హ్రుదయపు శ్వాస తేరి పార చూడు ఆ కనిపిస్తున్న తలకిందుల ఇసుర్రాయిని అది అప్పుడే చేయించుకున్న చంద్రహారం అప్పులోని గుర్రాలోలే ఒక దానిమీద ఒకటి అప్పుడవి రెండు రంజాన్ చంద్రవంకలు సప్త పథమున పొందిచ్చిన ఈస్టర్ ఐలాండు నవ్వితే హాస్యకుహరమే వెయ్యి వరాల పాపికొండ నింగి నుంచి నేలకు దూకె గంగ నోట్లనే బుడుబుంగ పాలు పల్లు ఆకుకూర ..తీరొక్క సియ్యకూర అదొక ప్ర"యోగ"శాల పంటి పొంటనే పానసరం బన్న జలచరం.. అది నాలుక నాలికమీదె నానా రుచుల తండ తండాలకొక కొండదేవర చుట్టూ కంటికి రెప్పల రొమ్ము విర్చుకొని కొలువైన రాయంచలు చిన్న చిరునవ్వుకే మొఖమ్మీద పొద్దుతిరుగుడు దీపం స_త_థ_ స్థాన _కారణ్యాలతో భాషించే సొగసు చక్కని ఆహారపు గొలుసు సంస్కౄతికి నిలివెత్తు దినుసు స్వరపేటికకు మంచి ఆందాన్ * * * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hg5ugd

Posted by Katta

సిరి వడ్డే కవిత

ll నా లచ్చి జాడ...మీరైనా సెప్పరూ ? ll సుక్కవై నను సేరావు సప్పున నా మనసే దోసావు ఏడని ఎతకనే లచ్చీ ఇన్నిఏల సుక్కల్లో నిను ఎన్నెలై అగుపించి దోబూసులాడకే జాబిలివై మురిపించి మబ్బుల సాటున దాగకే సిరుగాలై నను తాకావు సెలయేరై సేదతీర్సావు ఏ మంచు దిబ్బలనడగను ఆ సల్లదనం ఏదని ? "కొమ్మ" వై నను ఊహల ఊయలలే ఊపావు ముద్దు గుమ్మవై అందాల ఇందులే సేసావు ఏ కొమ్మన వాలి మురిపిత్తున్నావో కోయిల పాటలతో జతకలిపి పూలగంధమై పరిమలించావు ఏ పూదోట దాగినావో మాటల మదువులతో మామను మురిపించి మాయసేసి నను నీనీడగా దాసేసావు నను ఇడిసి పోనని బాసలే సేసి ఏడ దాగున్నావో ఆదమరసి ఏటిగట్టుకు సానమాడ బోతినంటివే పిత్తపరిగలు బేరమాడి తెత్తనంటివే ఏటిలోని సేప పిల్లనడిగా కొలనులోని కలువబామనడిగా గూటిలోని గువ్వపిల్లనారా తీసినా నిండు సందురున్ని సైతం నిలదీసినా జాజి మల్లెలన్ని అలిగిపోయే మాలల్లలేదేమని పొదరిల్లు బోసిపోయే దీపమెట్టలేదని పోయ్యిలోన పిల్లికూన ముడుసుకున్నదే కాలమేమో పగపట్టి కదలకున్నదే సెలఏరులన్నీ నీ నవ్వుల గలగలనే తలపిత్తన్నాయే కూనలమ్మలన్ని నీ పలుకుల తేనియలనే ఊరిత్తన్నాయే పూవులన్నీ నీ మనస్సులోని మమతలతో మురిపిత్తన్నాయే పైరు గాలి నీ యెదసొదలనే ఇనిపిత్తన్నాయే గువ్వలనడిగితే గుసగుస లాడుకుంటున్నాయే మల్లెలనడిగితే మత్తుగా సొమ్మసిల్లిపోతున్నాయే కొండలనడిగితే కరగనైనా కరగవే కోనలమ్మలైనా బదులీయకున్నవే నిను ఇడిసి నేనుండలేనే ఏడేడు జన్మల తోడై నాతో నడిసి రావే మావ మదిలో కొలువుండి పోవే మావ కంటి ముత్యమై గుండెలో దాగుండిపోవే ll సిరి వడ్డే ll 01-05-2014

by సిరి వడ్డే



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fvfuY1

Posted by Katta

Vani Koratamaddi కవిత

//నీ రూపం...// పెదవి దాటని మాటలకు మౌనమే సాక్షమ్ములే మనసులోని భావమంతా పదములుగ ప్రకటింతులే ఆగిపోని ఆలోచనంతా గడిచిపోయిన జ్ఞాపకములే కనుమరుగైన రూపానికి కనిపించదు నా కన్నీరులే జరిగిపోయిన కాలమంతా తిరిగిరాని స్వప్నమే ఆశపడిన జీవితం అందని అదృష్టమే.. మిగిలిపోయిన జీవితం నీ గురుతుల నీడలే మనసు అంతా పరచుకున్న మమత నిండిన నీ రూపమే మరలి రాని అదృష్టమే.. ....వాణి కొరటమద్ది 1/5/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PSICvH

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ కార్మిక దినోత్సవం @ ఒక నిరసన లోంచి ఉద్బవించిన మహోదయం ఇది హక్కు కోసం నినదించిన గుండెలు పిడికిల్లెత్తిన దినం ఇది చెమటకు విలువ కట్టక నెత్తురును లెక్క చేయక దేహాలను హూనం చేస్తూ శ్రామిక కండబలాన్ని దోచేస్తున్న పెట్టుబడి దారు మధబలాన్నికృశింప జేసి అనైతిక వ్యాపార దొరనిని కంపింప జేసిన విజయారుణోదయం ఇది. పారింది శ్రమ జీవుల రక్తమే.కాని, ఆ గెలుపు కార్మిక జాతికి యుగాంతం వరకు...ఒక పెద్ద దిక్కు. అది శ్రామిక జీవన గమనంలో ఒక నిత్య నూతనోధయం. ఆ విజయపు రుదిర ధారలు స్వేద వంశీకుల మనుగడకు కొత్త దారులు పని చేయడమే మన పని కాదని, శ్రమకు విలువ సాదించడమని పని మనుషులకు విలువ సాదించుకోవడమని వృత్తికి సమాన వేతనం ఉండాలని వేళకు మించి శ్రమ బారం ఉండరాదని కార్మిక భవిత స్వర్ణమయం కావాలని హక్కుల కోసం పోరాడి ఆ ఆశయ సాధనలో ఎందరో నేలకొరిగిన త్యాగదనులదినమిది. అందుకే, ఈ అరుణోదయం ఈనాడు కార్మిక దినోత్సవమైంది... _ కొత్త అనిల్ కుమార్. 1 / 5 / 2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hVc27K

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

మా ఎదురింటి కిటికీలో ఒక సూర్యబింబం ఉంది అది నన్ను చూసీచూడగానే తన క్రీగంటి చూపుల తీక్షణలతో కిటికీ తలుపుల్ని ఠపీమని మూసేస్తుంది మా వెనకింటి కిటికీలో ఒక చంద్రబింబం ఉంది అది నన్ను చూసీచూడగానే తన చల్లటిప్రేమ కిరణాల్ని నాపైకి వెదజల్లుతుంది మా కుడిపక్కింటి కిటికీలో ఒక తారక ఉంది అది నన్ను చూసీచూడగానే తన మినుకు మినుకుమనే తళుకుల చూపుల్ని నాపై ప్రసరింపజేస్తుంది మా ఎడపపక్కింటి కిటికీలో ఒక కలువపువ్వుంది అది నన్ను చూసీచూడగానే తన ఎర్రటి కాంతుల్ని నాపైకి రువ్వుతుంది నన్ను పలకరించి పరవశింపజేస్తుంది.

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKFr8e

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

మా అమ్మా నాన్నలు మాకిచ్చిపోయిన ఆస్థిపాస్తులు బరువుగా బ్రతకడం కాదుగానీ

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iFFsCD

Posted by Katta

Nishi Srinivas కవిత

"నువ్వంటే నాకిష్టం..." - నిషిగంధ నిజంగా... నీ పరిచయం నాకు ఓ చంద్రోదయం! నీ అల్లరి చూపుల ఆరాధనలంటే నాకిష్టం... కల్మషం లేని నీ నవ్వులోని అందం అంటే చాలా చాలా ఇష్టం... నాలో నాటిన నీ వలపు బాణాలు దాచుకోవడం ఎంతో ఇష్టం.... నీ నయనాల్లో నాకై పూచిన వెన్నెల పూలంటే నాకు మరీ ఇష్టం.. నేను ఉడుక్కోవాలని నువ్వు కవ్వించే మాటలంటే ఇంకా ఇంకా ఇష్టం..... నా చేయి నీ చేతిలో ఇమిడిన క్షణం నన్ను ఎప్పటికి వీడనని నువ్విచ్ఛే భరోసా భావం చాలా చాలా ఇష్టం.... నా `నువ్వంటే' నాకు ఇష్టానికే అసూయ కలిగేంత ఇష్టం... హరివిల్లుకు బాష్యం చెప్పే నీ నవ్వంటే మరీ మరీ ఇష్టం! -నిషిగంధ 01-05-2014

by Nishi Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLlY4x

Posted by Katta

Satya Murali Krishna Gorasa కవిత

ఎర్రదనంతో కొత్త సూర్యుడిలా....ముందుకు దూసుకొచ్చి కండలు కదిలించి ... రక్తన్ని మరిగించి.... స్వేదన్ని చిందించి... పెట్టిబడి దారుల బొక్కసాన్ని.. నింపుతున్న ఓ కార్మికుడా.... నేడే....నీకు " మే డే ".... ...........ఎస్ .ఎం. కె. గోరస

by Satya Murali Krishna Gorasa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLlUSm

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ// జనన మరణం // మూర్కత్వాన్ని అమాయకత్వంగా మోసగించడాన్ని అపరిపక్వతగా స్వీకరించడం- రాని నిద్ర కోసం పడే తాపత్రయం కునుకు రాక గడిపిన కాలమంతా... చీకట్లో నీడ కనపడక పగటిని దుఖఃమని నిర్ధారించుకొంది. నిట్టూర్పుల నిడివిలో... వెలుతురు నిర్మించుకున్న అశ యాదృచ్చికం. రాత్రి మాయమయ్యే నీడ అసంకల్పింతం. దుఖాఃనికి సంతోషానికి వ్యత్యాసం పుట్టుకకి చావుకి నడుమున్న దూరం. నిద్ర పట్టిన ప్రతీ రాత్రీ ఒక మరణం. మెలుకువ వచ్చిన ప్రతి వేకువా ఒక జననం....01.05.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLlUS9

Posted by Katta

Sanjeev Goud కవిత

Naresh-Sanjeev / ?????? --------------------- On a dark moonless night... I sit back to think of my old friend... Who came like a bright star in the twilight... and then disappeared into the moonless night.... Where has he gone I sit back to think... But alas! I get no answer... He who was my closest one Whom I shirked not to tell anything Who bore the answer to my every question and was my soul mate in my depression Who shared my laughter with greater enthusiasm... and shed the tears with more regression.. Oh!! tell me lord what had I done.. to lose the one and only one who my friend who was my soul who was my only one in the world! ------------------- ఒక నిశీధి రాత్రి వేళ లో ఆరు బయట కూచొని ఆలోచనా లోచనాల తో ఆకాశం వంక చూస్తున్నపుడు జ్ఞాపకాల పాతర లోనుంచి పాత నేస్తం ఒకడు ఉల్క లా మెరిసి చీకటి పొరల్లో దొర్లి పోయాడు!!! సావకాశంగా అతడి అంతర్ధానం గూర్చి ఆలోచిస్తే అయ్యో !!!!! జవాబు చిక్కదే!!! ఆ నాడు నాకతడు ఎంత సన్నిహితుడో చెప్పడానికి నాకు భాష్యం లేదు!!! అతడు నా ఎన్నో ప్రశ్నలకు సమాదానమై నిలిచినవాడు !!!! వ్యధ లో వేదనలో యెద భాగమై మెలిగిన వాడు !! వేడుక లో వాడుక లో వేకువై వెలిగినవాడు !!!! సంతాపంలోవిచారంలో సాంత్వన పలికిన వాడు !!!! ఓహ్ !! దైవమా !! ఈ విశాల విశ్వం లో నాకున్న ఒకే ఒక మిత్రునికి దూరమెందుకు అయ్యాను ??? ఆత్మీయ హృదయానికి అంతరం ఎందుకొచ్చింది !!!? ఏం చేసానని నేను నన్ను నేను కోల్పోయాను ??? @@@@@ -

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R5rF2a

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

రాధా మానస చొర నందకిశోర కన్నయ్యా ఏమని వర్ణింతు నీ సన్నిధి లో మాధుర్యం ఏ గానం విన్నా నీ మురళీ గానమే కదా ఎక్కడ చిరు సవ్వడి విన్నా నీ ఆగమన భావమే నీ చూపుల స్పర్స నా మదిని నిలువరించ కున్నది ప్రతి చిరుగాలి నీ రాకను నాకు తెలుపుచున్నది నీకొరకై వేచిన ఈ భక్తురాలిని కావ రావా కరుణాల వాల !! నీకొరకై వేచి వుండే బృందావన రాధను కాదు నిన్నే సర్వస్వం అనుకునే మీరాను కానేకాను నీ నామం నకు నీకు భేదం లేదను భావం కలిగిన దానను కృష్ణా !!పార్ధ !!

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hV2pWI

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || నేడే మేడే || ============================ మట్టి చేతులన్ని వట్టిపోతున్నాయి గట్టి చేతులన్ని మట్టి కొడుతున్నాయి కాలే కడుపులన్ని ఆకలి కేకలు పెడుతున్నాయి పేగుల్లో ఎన్నో ఆకలి బాధలు వేదనలు చెప్తున్నాయి గాయాలన్నీ పునరావృతమవుతున్నాయి రసి కారే జ్ఞాపకాలన్నీ మళ్లీ తరుముకొస్తున్నాయి స్వేదం చిందించే జీవితాలన్నీ కరుడుగడుతున్నాయి దోపిడీ వర్గ దారుల్లో కార్పోరేట్ షోకులన్ని పడగ విప్పుతున్నాయి దేహాలును తాకట్టు పెట్టి దేశాలు పరిగెడుతున్నాయి కూడు నీడ లేని జీవితాలును తాకట్టుగా మార్చి ప్రపంచ బ్యాంకు అప్పుకు తలరాతలు రాసి తలసరి ఆదాయం చూపించి,ప్రతీ తలకాయకు అప్పు తెచ్చి పబ్బం గడుపుకునే నీ సామ్రాజ్యం అదురుతుందెక్కడో ! మండే గుండె రగిలిపోతుంది రగిలే గుండె మండిపోతుంది పగిలిన గుండె తరుక్కుపోతుంది బిరుసెక్కిన శరీరం వేడెక్కి పోతుంది ఆకాశం లో మేఘాలన్నీ ఎర్రగా మారిపోయాయి బహుశా దేశాంతరాలు వీడి వస్తున్నాయి కాబోలు ఎరుపెక్కిన మేఘాలు భానుడినే బెదిరిస్తున్నాయి కదం తొక్కే శ్రామిక లోకం ఉక్కు పిడికిలి బిగించింది మేడే సాక్షిగా గత పోరాటాలకు ఎర్ర జెండా ఎగుర వేసింది కార్మిక లోకం ఐక్యత ఎర్రగా విప్లవాన్ని విరబూసింది ఉద్యమాల ఊపిరి కదం తొక్కింది. గుడిసెలను చూసి అద్దాల మేడలు అదిరి పడుతున్నాయి విప్లవ జ్వాలల ఛాయలకు బెదిరిపడుతున్నాయి అంతా చీకటే ! ఆకాశం లో ఒక చిన్న మెరుపు ఎర్రగా ! గగన వీధుల్లో సైతం ఎర్ర జెండా చిహ్నాలు మెరుస్తున్నాయి కళ్ళన్నీ ఎరుపెక్కాయి ... ఎర్రటి దారులు పరిచాయి రక్తం తడిచిన చొక్కాలు ఎర్ర జెండాలై లాల్ సలాం ... అంటూ రెప రెప లాడుతున్నాయి ============ మే డే /2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKwnQK

Posted by Katta

Jyothirmayi Malla కవిత

ఓటు వెయ్యడమంటే ||జ్యోతిర్మయి మళ్ళ|| ఓటు వెయ్యడమంటే.. ఓ ముద్ర గుద్దేసి నిద్రోడం కాదు నల్లచుక్క పోతుంది నాల్రోజులకే నువు ఎన్నుకున్నది ఓ సన్నాసినయితే పొమ్మన్నా పోడు నాలుగేళ్ళకీ ఓటు వెయ్యడమంటే.. ఒక రోజు సెలవు సంబరం కాదు వెయ్యని నీ ఓటు ఎక్కడో వేస్తుంది ఓ వేటు నీకే తెలీకుండా చేయగలదు లోటు ఓటు వెయ్యడమంటే.. మనజాతీ మనప్రాంతం మనసొంతమంటూ మనోడి మీద చూపే ఇష్టం కాదు మనదేశం మనరాష్ఠ్రం మన ఉన్నతికోరే మంచోడికి కట్టే పట్టం

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKwnQx

Posted by Katta

Bandla Madhava Rao కవిత



by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hYUZ0d

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/అర్థాల వసారా ::::::::::::::::::::­:::::::::::::::::: పదాల మేడల్లో నేను ముడుచుకొని కూర్చున్నపుడు వాక్యాలు నీ చుట్టూ లతలా అల్లుకుంటాయి అర్థాల సమాధులపై దులిపిన భావాల దుమ్ములా నేను నేల పగుళ్ళలో గాలిని నింపి కొత్తపూడికలకు శాంతి స్థాపన చేస్తూ నువ్వు నీళ్ళను మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఒడిలిన రెండు చేతులు రంగుల కొవ్వుత్తులను కొత్తగా వెలిగించడం కోసం ఆశల బావుల్లో ఎన్నిసార్లు తొంగిచూసినా కొత్తగా కనబడదే ఎప్పుడూ పాత నీడలే మునుపెన్నడో నేశాను అంతరంగ పరికిణీని ఇంకా ఏ కలలు తొడుక్కోలేదు ఎండిపోయిన పూల సుగంధంలా నా కళ్ళు తడారుతుంటాయి ప్రతిరోజూ నా గదిలో శూన్యం కనిపించిన ప్రతిసారి చెబుతుంటాను కాస్తంత ఖాళీ ఉంచమని నేనొచ్చేదాకా మనసు గుహల్లో ఎన్ని శవాలో ప్రతి నిత్యం కాలుతుంటాయి నిర్వేదానికి ఒత్తాసులా చెక్క తలుపుల మధ్యన ఓ నిండు సువాసన తెరచిమూసినప్పుడల్లా వసారాలో ఒంటరి ధూలాలు చెదలతో రమిస్తూ వర్షం పలకరించినపుడల్లా ఒళ్ళుతడుపుకుంటూ కొంత మట్టివాసనను లోలోపలకు తోడుకుంటూ మరికొన్ని అక్షరాలు నగ్నంగా నానాలి కొత్త అణువుల శోధనలో తిలక్ బొమ్మరాజు 05.04.14 20.04.14 వాకిలిలో ప్రచురినుయిన నా కవిత http://ift.tt/1hUwxBk

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hUwxBk

Posted by Katta

John Hyde Kanumuri కవిత

తరతరాలుగా ఏమీ లేదిక్కడ నినాదాలు తప్ప ప్రపంచ కార్మికులారా! ఏకంకండి! ఏమిసాధించాం మళ్ళీ బానిసత్వానికి తెరలు తీద్దాం కాంట్రాక్టు పనులన్నీ బానిసత్వమేగా! చెమట రంగు పులుముకొని నినదిద్దాం చెమటకు అన్నిరంగులొక్కటే అక్కడో బిర్యానీ దొరుకుతుంది! ఈ రోజు గడిచిపోతుంది ఎండిన డొక్కలు మండే కడుపులపై ఎసి కార్లు దూసుకుపోతాయి నిన్నెవరో పుట్టారు! ఈ రోజెవరో గిట్టారు! ఎవ్వరు మిగిల్చిందేమీ లేదు అలా అలా విదిల్చిన అక్షరాలను అద్దాల మేడల్లో పదిలపర్చుకుంటున్నారెవరో! రెక్కల కష్టం నాదే! ఆకలి అరుపు నాదే! ఆత్మఘోష, కంఠశోష కన్నీటి చెరువులెండిపోతున్నాయి సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు ఏమీ లేదిక్కడ నినాదాలు తప్ప .............some mixed feelings 1.5.2014 05:40 hours ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nK3RPa

Posted by Katta

Afsar Afsar కవిత

టెక్సాస్ కవయిత్రి కార్లా మోర్టాన్ వొక వైపు కాన్సర్ ని సవాలు చేస్తోంది. మరో వైపు కవిత్వంలోని అలంకారాలనీ సవాలు చేస్తోంది. ఆమె కవిత్వం నిరలంకారంగా, నిరాడంబరంగా కేవలం జీవితాన్నే పాడే పదం. గత ఏడాది టెక్సాస్ పొయెట్ లారెట్ గా గౌరవం పొందిన కార్లా కొత్త పుస్తకం "రీడిఫైనింగ్ బ్యూటీ". టెక్సాస్ పొయెట్ లారెట్ అనే గౌరవం ఇప్పటిదాకా పురుషులకే సొంతం. మొట్టమొదటి సారిగా ఈ గౌరవాన్ని గెల్చుకోవడం అంటే కార్లాకే కాదు, అమెరికన్ కవిత్వ చరిత్రలో స్త్రీలు ఎగరేసిన విజయ కేతనం. బ్రెస్ట్ కాన్సర్ తో రోజూ మరణంతో తలపడుతున్న కార్లా కవిత్వాన్ని వొక హీలింగ్ తెరపి అంటుంది. “రోజూ కవిత్వంతో మళ్ళీ మళ్ళీ బతుకుతూ వుంటాను. పదాలు ఎవరికేం చేస్తాయో నాకు తెలీదు కాని, నా మటుకు నాకు అవి థెరపీ. నాలోపల వొక ఉద్వేగాన్ని పదాలు బతికిస్తాయి. ఆ ఉద్వేగాన్ని మీలోనూ బతికిస్తే నా కవిత్వం గెల్చినట్టే!” అంటుంది కార్లా. కాన్సర్ రాక ముందు కార్లా కి అందమైన జుత్తు వుండేది. కాన్సర్ వల్ల గుండు గీయించుకోవాల్సి వచ్చింది. ఈ కవిత ఆమె అందమైన జుత్తుకి వీడ్కోలు. ~ గాలికి చేతులున్నాయని నాకు తెలీదు, నా తల అంతా శుభ్రంగా గొరికించుకునేంత దాకా దాని చేతులు ప్రేమగా నన్ను నిమిరేంత దాకా . నా వొళ్ళు ఇంత అందంగా వుంటుందనీ తెలీదు దాన్ని ఎవరో తెరిచి, కత్తెర వేసి, ఏదో విషంతో నింపెంత దాకా. ఆత్మకీ కళ్ళు వుంటాయని తెలీనే తెలీదు నా గుండె చివరంటా నన్ను వొలుచుకొని నా అస్తిత్వాన్నంతా రాల్చుకొని, మరణమా! నీ దాకా వచ్చే దాకా! నీ నిశ్శబ్దపు చూపు కింద నగ్నంగా వికలంగా నిల్చునే దాకా. మూలం: కార్లా కె. మోర్టాన్.

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R4KYIJ

Posted by Katta

Mohan Rishi కవిత

మోహన్ రుషి // వేసవి రాత్రి // గ్రిల్స్ గుండా చూస్తుంది జీవితం, నిన్ను. జాలిగా. హేళనగా. భరిస్తుంది నీ మాటల వాంతిని. సహిస్తుంది నీ కలల భ్రాంతిని. చేసే మోసం గమనిస్తుంది నిశ్శబ్దంగా. వేసే వేషం పసికడ్తుంది నిశితంగా. ఏడ్పుకు నవ్వుకుంటుంది బిగ్గరగా. నవ్వునేనాడూ అల్లుకోదు దగ్గరగా. ఒకటే జీవితమని తెల్సీ రెండుగా బతుకుతున్నప్పుడు. రెండవ ప్రపంచంలో ఒంటిగా మిగులుతున్నప్పుడు. తడిని పూడ్చి తన్మయత్వం పొందుతున్నప్పుడు. నువ్వెవడివో తెలిసినా తెలియక, తెలియకా తెలిసి భ్రమిస్తున్నప్పుడు. **** వెనుదిరిగినప్పుడు చప్పుడు చేసిన తలుపుని వింటే, ఇక, అప్పుడు, అదే గ్రిల్స్ గుండా జీవితంలోకి ఎలా చూడాలో తెలుస్తుందనుకుంటాను. 1.5.2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SbmJtM

Posted by Katta

Renuka Ayola కవిత

రెండు గింజలు చల్లి వెళ్లి పోయారు వాళ్లు చేసిందేమీ లేదు రెండు గింజలు చల్లి వెళ్లి పోయారు ఎండిన నేలలో గింజలు నీటిని తడుముకుని చిగురు తొడిగి పూలుపూచి మాటల గింజల మూటని నగరంలో ఎగరేసాయి ఎండిన ఆకుల్లా మాటలు గాలిలో షికార్లు చేసాయి మాటలు మాటలు ఎక్కడ చూసిన మాటలు వృక్షాలని నేలకూల్చాయి నీడలని దాచేసాయి నెత్తురు చవిచూసాయి ప్రాణాలు తీసాయి వాటి అర్ధం వెతికే పనిలో నగరం నలిగిపోయింది ప్రతీ ముఖంలో మాటలు నత్తి నత్తిగా పలుకుతున్నాయి ద్రోహం వలతో మాటల ఎరలు ఎర్రగా మెరుస్తూ తలలాడించాయి ఎండిన నదుల నిండా మాటలు మురికిగా పారుతున్నాయి కనిపించిన మనిషి బుజాలేక్కిన మాటలు బుజాలని నరుకుతున్నాయి పల్లేరు కాయల్లా గుచ్చుకుంటున్నాయి మాట మాటకి వెక్కిరింతలు విడిపోలేదేమని కుశల ప్రశ్నలు ఇంకా మాటలు ఊరుతునే ఉన్నాయి సముద్రాలు సృస్టించి ఇసుకమేటలు వేస్తున్నాయి చీకటిలో చుక్కలు ,పక్కటెముకలమీద చురకత్తులు గొంతుకి ఊరి తాళ్ళు సిధం చేస్తున్నాయి అయిన అందరూ మాట్లడుతూనే ఉన్నారు వాళ్ళు చేసిందేమీ లేదు రెండు గింజలు చల్లి వెళ్ళిపోయారు

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o45QuW

Posted by Katta