పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sri Modugu కవిత

Sri Modugu // lovely ending … // He loved her She loved him he liked the way she looked But she didn`t like way he loved Still she loved him Because she liked the way she loved They grew up together from selfless to selfish So it remained Once up on a time They loved each other very lovingly They fought each other very lovingly They cried for each other very lovingly Now They are still in love The only change is……. now they can only love themselves ….. By the way She loves this lovely ending Date:18/04/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hTHmot

Posted by Katta

Harika Haari కవిత

ప్రేమ లేకుండా జివించలేమా అంటే జివించగలం , కానీ అలా జివించే జీవితం మోడుబారిన చెట్టు లాంటిదని ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది... అందుకే నీ పై నా ప్రేమ తెలపాలని వచ్చాను ...! కానీ ఈ లోపే నీ మనసు నీలో లేదని తెలిసి మౌనంగా వెనుదిరిగాను... నా ప్రేమను తెలుపలేని పరిస్థితి , నీ ప్రేమను పొందలేని దుస్థితి ...! అయినా వసంతంలో కోకిల గానంలా, నీ ప్రేమకోసం నేను ఎదురుచూస్తుంటాను...! - హారిక / 18/04/2014

by Harika Haari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jcFbru

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి సంగ్రామం కాసేపు కాలాన్ని నిలిపేద్దాం ఎందుకంటే, ముందుకు పోయాకా వెనక్కి రావడం కష్టం కదా ఇప్పుడు, ఇక్కడే ఆగాలి మనం ముందుకు సాగాలంటే, ఇహ ఇక్కడ ఆగక తప్పదు ఇప్పుడొకసారి మన అంతరాత్మ మాట విందాం ఎన్నో సార్లు తన మాటని పెడచెవిన పెట్టాము మనం అందుకే మనం మనల్ని కోల్పోయాం ఐనా తను మనతోనే ఉంది, మనలోనే ఉంది మన బాగు కోసం, మన భవిష్యత్తు కోసం కాబట్టి ఈ సారైనా తన మాట, తన పాట విందాం అదిగో; సంగ్రామం ముంచుకొస్తోంది అదిగో, రాజులు, మంత్రులు, సేనాధిపతులు వాళ్లంతా మన తరపున యుద్దం చేయడానికి వస్తున్నట్టు నటిస్తూ మనల్ని ఓడించడానికి వస్తున్న ముష్కరులే తమ గుప్పెట్లో మన జీవితాల్ని మరో ఐదు సంవత్సరాలకో, మరో పది సంవత్సరాలకో లేదా తరతరాలకో మనల్ని తమ గుప్పెట్లో బంధించుకోవడానికి వస్తున్న నాయకులే వారు గుప్పెట ఒక తాటాకు మాత్రమే కానీ, మన గుప్పెట ఏకంగా ఒక ఆకాశమే గదా వారి ఉపన్యాసం ఒక విన్యాసమే కానీ మన మౌనం మహా మంత్రం కాదా అందుకే మనం మౌనంగా ఉందాం, మౌనంగా విందాం మనకి తెలుసు ధనికుడు ఇంకా ధనికుడవుతున్నాడు పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు యువత ఉపాధి లేక అల్లాడిపోతోంది సమాజంలో అమానుషం పెట్రేగిపోతోంది దేశాన్ని అవినీతి చీడలా పట్టి పీడిస్తోంది అభివృద్ది కుంటుపడింది దీనికి కారణం ఎవరు? పాలకులు కారా? మరి ఆ పాలకులకి పాలేరుల్లా ఉందామా లేక రాజ్యాంగమిచ్చిన ప్రజాస్వామ్య స్వేచ్చలో పాలకులమే అవుదామా, ఆలోచించండి అదిగో సమరక్షేత్రం సముద్రం ఉప్పెనతో కబళించడానికి సమాయత్తమవుతున్నట్టు కదిలి వస్తోంది రాజకీయప్రవాహం ఐనా మనకేం భయం మనం ఒక ఆకాశసమూహం ఆకాశాన్ని ఏం చేయగలదు సముద్రం వెళ్దాం పదండి సమర క్షేత్రంలోకి మన భవిషత్తు మన తరతరాల భవిష్యత్తు ఇప్పుడు మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంది మన ధైర్యంపైనే, పౌరుషం పైనే ఆధారపడి ఉంది ఈ యుద్దకుయుక్తిలో మనల్ని ఓడించడానికి ఎన్ని దుష్టశక్తులు బయలుదేరుతున్నాయో చూడండి కానీ మనలో ఉన్న ప్రజాశక్తి ముందు అది తల వంచాల్సిందే కనుక లేవండి, నిద్దుర లేవండి పాస్ మార్కులు కూడా లేని ఓట్లతో వాళ్ళని గెలిపిస్తూ మనం ఓడిపోతూ వచ్చాం ఈ ఒక్క రోజు అన్ని సుఖాల్ని వదిలేద్దాం ఆ ఒక్క రోజూ బద్దకాన్ని వదిలేద్దాం ఎండైనా వానైనా సమరక్షేత్రంలో నిలబడి మన చూపుడు వ్రేలునే ఆయుధంగా చేసుకుని మన యుద్దం మనం చేద్దాం అంతరాత్మ చెప్పే నిజానికి ఓటేద్దాం వారు పచ్చనోట్లకి మనల్ని కొని మన పచ్చని కాపురాల్ని దోచుకోజూసుకోవారే కాబట్టి, వాళ్ళ విషవలయంలోకి వాళ్లనే నెట్టుదాం పిల్లలారా, పెద్దలారా, లేవండి, జాగృతం కండి మన హక్కులు మనం సాధించుకుందాం మన సమాజాన్ని మనం నిర్మించుకుందాం మన గొయ్యి మనమే తీసుకునే సంస్కృతికి ఇక ముగింపు పలుకుదాం ఇక లేద్దాం, చైతన్యస్రవంతిలో నడుద్దాం మనలో గూడు కట్టుకున్న అచేతనని ఛేదించి వ్యూహాల్ని భేదిద్దాం, న్యాయాన్ని గెలిపిద్దాం ధర్మస్థాపనకై నడుము బిగిద్దాం సొమ్ములుతో మన జీవితాల్ని కొనచూసే ఆ రాబంధులపై రాళ్లని విసురుదాం అంతే కానీ, ఒక వారం కూలీ డబ్బు కోసం కక్కుర్తిపడి, మన భవిష్యత్తుని అమ్ముకోకుండా మనల్ని మనం రక్షించుకుందాం లేవండి, పిడికిలి లేపుదాం; ఓటుని గుద్దుదాం గుండెలు అదిరేలా ఓటుని గుద్దుదాం ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఓటుని గుద్దుదాం మన జీవితాలకి ఆ చుక్కే ఒక వేగుచుక్కై మన జీవితాల్లో వెలుగు నింపేలా మన అంతిమతీర్పునిద్దాం మన ఓటుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచే నాయకుల గుండెల్లో నిద్దురపోదాం మన పాలన మనమే చేసుకుంటూ ప్రగతిపధంలోకి సాగుదాం! 18Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eHfBiu

Posted by Katta

Krishna Mani కవిత

కోరిక ***** పుంటికూరలో రొయ్యలను కలిపి తినాలని ఉంది జొన్న రొట్టేలో పులసచేపను నంజుకోవాలని ఉంది పోలెల్లో పూర్ణం బదులు బందరు లడ్డు పూతరేకులను పెట్టాలని వుంది అంబలితో సంకటిని కలిపి మేక మాసంతో లోట్టలేయ్యాలని ఉంది ! అన్నదమ్ములతో కలసి కడలి తీరానా ఇసుక తిన్నలపై బొమ్మరిల్లు చేసుకొని ఆడాలని ఉంది శ్రీకాకుళం అడవిలో జీడి గింజలను ఏరుకోవాలని ఉంది అరకు కొండల్లో చలి కాచుకోవాలని ఉంది ! రాజమండ్రిలో వేదం చదవాలని ఉంది కోనసీమ కొబ్బరి నీళ్ళను తాగుతూ పచ్చని కాంతులను మనసున బందించాలని ఉంది బెజవాడ అంచున కృష్ణమ్మ నడకలను చూడాలని ఉంది కొల్లేటి సరస్సులో వలస పక్షులతో మాటకలపాలని ఉంది ! అహోబిలం అడవిలో ఒంటరినై వన్యమృగాలతో ఆడుకోవాలని ఉంది శ్రీహరికోటలో PSLV కి తోడుగా వెళ్ళి భూగోళాన్ని చేతుల్లో పట్టి ముద్దాడాలని ఉంది తిరుపతి ఎంకన్న కొండను కాలినడకన వెళ్ళి ప్రకృతి అందాలను కాంచాలని ఉంది ఇవన్నీ ఇప్పుడు నావికావు పరాయి రాష్ట్రం తెలుగుకు రెండు వెలుగులు అది మాత్రం ఇష్టం గత గాయాలను మాన్పుకొని చల్లబడ్డ మనసులలో కొత్తపూలు పూయాలని ఉబలాటం ! కృష్ణ మణి I 18-04-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pfPALP

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qSWbt5

Posted by Katta

Sk Razaq కవిత

|| మౌనం తో నువ్వు సంధిస్తున్న ప్రశ్నలు || మౌనం తో నువ్వు సంధిస్తున్న ప్రశ్నలు నా అంతరంగాన్ని చిల్చే వేటగాడి బాణాలు అవుతునాయి సమాధానం సత్యమే అయినా ని తుఫాను హోరుల అలజడిలో అర్ధంకాని భాషగా మిగిలి పోతున్నాయి నీ మౌనం నన్నో మనిషిగా చూస్తున్నట్లుగా లేదు అందుకే మాటలతో చెప్పనియ్యవు.. చెవులను దాస్తావు కనులతో పలుకరించనియ్యవు.. కన్నీటి దారాలు పొంగిస్తావు మనసుతో సంభాషించాలని దగ్గరకు తీసుకుంటే.. కరుకు రోజా పువ్వు ముల్లులా గాయం చేస్తునావు గుండె గాయాలకి పలకరింపులే లేపనం ప్రియా నువ్వు నా జీవితకాల తోడువు మరచిపోకు అభద్దమైతే నమ్మించగలం మరి నిజాన్ని నమ్మించమంటావా ? మరైతే సరే, నే సత్యమే చెబుతున్న కలియుగ శ్రీ రామచంద్రుడిని, ఏక ప్రియ, పత్ని వ్రతుడను , పెళ్ళికి ముందు ప్రియురాలు, పెళ్లి తరువాత ఇల్లాలు ఇద్దరూ ఒక్కరే అంటే ఇంకా నమ్మవెం ? సాక్ష్యం చుపమంటావా? నా అంతరంగాన్ని స్పృశించి చూడు ని అబద్ధమైన శoశయా అంతమైపోతుంది నీలో ని ఆ ఇద్దరూ ఒకటే అని తెలుసోస్తుంది. || రజాక్ || 18-04-2014, 13:43

by Sk Razaq



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f13Gqt

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/అట్టముక్క ::::::::::::::::::: వాన చినుకులకి తడిసిన అట్టముక్క వాటి మీద ఎప్పుడో రాసుకున్న కొన్నిఅక్షరాలు వాక్యాల ధూలానికి పీట కింద ఏదో ముతక వాసన వేస్తుంటే బయటకి తీసాను వృద్దాప్యంలో చలిచీమలు దాని సహవాసంలో ఎవరో సిరా ఇంకుతో అద్దినట్టున్నారు ఆ అట్టమీద కమ్మని పాత సుగంధం అప్పుడెప్పుడో అమ్మ బయటపారేస్తానంటే దాచినట్టు గుర్తు ఖాళి కుర్చీ వాటి నాలుగు కాళ్ళు ఎవరికోసమో ఎదురుచూస్తున్నాయి ఎప్పటినుండో/దాని చుట్టూతా ఎప్పటిదో చుట్టవాసన ఇంకా అలానే ఉంది మా అందరిమధ్యా వరి కంకులు దులిపిన ఆ చేతులు ఇన్నిరంగులనద్దాయంటే ఓకింత ఆనందం కుప్ప నూర్చినా కోత కోసినా ఆ చేతులే ఇన్నాళ్ళకు మళ్ళా నా కళ్ళలో నానుతూ తాతయ్య జ్ఞాపకాలనుకుంట ఇంకాచెరిగిపోలేదు ఇంట్లోనూ అట్టముక్కలోనూ ఆ అట్టముక్క ఎప్పటికి పారేయలేదు మళ్ళీ తిలక్ బొమ్మరాజు 18.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jbWDO2

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||భేతాళం|| ఎప్పటిలాగే మనిద్దరం కలసి అలా కూచుంటాం ఆ మెలికలు తిరిగిన చెట్టు మొదలువద్ద ఎప్పటికి కదలలేని ఆ బండ మీద. నీ కిష్టమైన ఓ పుస్తకాన్ని పట్టుకొని, నేను చదవడం మొదలుపెడతాను, ఒక్కో వాక్యాన్ని మరింత అర్థవంతంగా పలకడానికి ప్రయత్నిస్తూ, అప్పుడప్పుడు నీ వైపుకి చూస్తూ. ఓ చిన్నపాటి చిరునవ్వుని చెదరనివ్వకుండా, మోకాళ్ల మీద చేతులేసుకొని, బంగారు బుగ్గలను, భుజాలకాన్చి మెత్తని కనురెప్పలతో కనులను మూసి, ఒక్కో కవితనో, కథనో పూర్తిస్థాయి శ్రవణానందంతో ఆస్వాదిస్తుంటావు, అలల్లా కదులుతున్న కురుల సాక్షిగా. నా విషయం కాస్తా పక్కన పెట్టినా, నాకు తెలుసు, నువ్వు దీన్ని ప్రేమిస్తావని. పూర్తయిన పుస్తకాలగుట్టల్లో ఏముందోగాని, నీతో కలసి ఇలా గడపడంలోనే నా జీవితముందని, నాకు తెలుసు. --------12/2013-------------------18/4/2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFCEpf

Posted by Katta

Sky Baaba కవిత

మోడిఫికేషన్ - - - - - - - - అవ్వారి నాగరాజు ఒక మిట్ట మధ్యాహ్నపు ఎండలో ఆకాశానికి కాషాయం పులుముతూ అంతా వీరంగం వేస్తున్నప్పుడు త్రిశూలపు పదునుటంచుల కొసలలో బలవంతంగా పెకలించిన గర్భస్త శిశువుల జాడ- తొణికిన ఒక్క ఉమ్మ నీటి చుక్కయినా ముఖాలకు ఉప్పెనయి తాకకపోతుందాని దారుల వెంట నువ్వు ఉన్మత్తుడవై వెతుకుతావు బలిసిన ధనాగారపు ఖార్ఖానాల దోసిళ్ళలో కొన్ని కలలను టోకుగా తయారుచేసి ఊళ్ల మీదకు రంగులురంగులుగా చిలకరిస్తున్నప్పుడు అధికారాలలో, మతాలలో అంచెలు అంచెలుగా అలుముకున్న ఆధిపత్యపు ఉన్మాదాలలో దేశమంటే మగతనమయి నిటారుగా లేపుక నిలుచున్న శిశ్నాలలో పొగలు కక్కుకునే విద్వేషం దేశభక్తయి చివరకూ ఎంతకూ కుతి తీరక యోనులలో తాగి పడేసిన సీసాలను జొనిపి - అది నెత్తురో, కరిగి పారుతున్న దేహమో తెలియక మండుతున్న దిసపాదాలతో అవే అవే అవే మాటలను పిచ్చిగా వదురుతూ కనపడని ఆ జాడల వెంట ఒక ప్రళయంలా తిరిగిన చోట్లలో మళ్ళీమళ్ళీ తిరుగుతావు ఎక్కడా దారి దొరకదు ఎవ్వరూ ఒక్క మాటను కూడా ఆశ్వాసనగా జ్వలిస్తున్న నీ దేహంపై కప్పరు రాలిన పూవుల కోసం పిచ్చిగా కవితలల్లి వాడిన ఆకులపై అదే పనిగా ఎక్కడెక్కడివో జీవజలల జాడలు వెతికి పలవరించి మరీ మాట్లాడే పుణ్యాత్ములు ఒక్కరూ నోరు విప్పరు అవును ప్రభూ అంబానీలు మెచ్చినవాడూ, జనాన్నంతటినీ మూకుమ్మడిగా ఏకతాటిపై నడిపించెడివాడూ, మాయలఫకీరు వంటి వాడూ అయిన నాయకుని కోసం నా దేశమిప్పుడు కలవరిస్తోంది

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i10Lhx

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి కమలం తనని చేరాలి తన లోకంలో ఉండి నన్నే పరికిస్తూ నాతో సంబాషిస్తూ ఉన్న ఆ కోమలిని చేరాలి; తన సౌందర్యంతో నన్ను మంత్రముగ్ధుడ్ని చేస్తున్న ఆ కోమలిని చేరాలి కానీ ఎలా? తన చెంతకి చేరడం ఎలా? నాకు తన లోకం లోకి ప్రవేశించడం తెలియదు తను నా లోకంలోకి రాలేదు మరేలా! కానీ మేమిద్దరం ఒకటి కావాలి ఎలా? ఏదో మాధ్యమం కావాలి కదా మేమిద్దరం ఒకటవ్వడానికి; నా చూపులతోనే తనని కౌగిలించుకున్నా ఆ నా చూపుల్లో నా ప్రేమమాధుర్యం నింపి; తను తన నవ్వుల్లో జీవనమాధుర్యం నింపి నన్ను తన హృదయంలో పరుచుకుంటూ ఉంటే తన సౌందర్యంలో హాయిగా జీవిస్తూ నేను! 18Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRv4vT

Posted by Katta

Arcube Kavi కవిత

ఈ యుద్దం కొనసాగుతది--4 ____________________ఆర్క్యూబ్ అంగ్ సాన్ సూకి--ఇరోం షర్మిల అరుందతి రాయ్--మేథాపాట్కర్ వీళ్ళంతా-సాయుధ బలగాల చట్టాల మద్య రక్తమోడుతున్న పావురాయికి తల్లి గుండెతో కట్టు కడుతున్న ఆలివ్ వౄక్షాలు దానికి ప్రాణం లేచచ్చే గాలులే ప్రాణ సంకటం కళ్ళ ఊట బావుల కింద తేటపడుతున్న విలువల మూలాలు దాన్ని నిప్పుల్లో నడిపిస్తయి కదా ప్రజా స్వామ్య దండకాన్నెత్తుకొని తుపాకే లోంచి దూకుతుంది అందుకే -వాళ్ళిప్పుడు గడ్డి పూల ఆకాశాన్ని నిలిపే మన కలల కంటి ఎర్ర చారికల సంతకం. * * * * * * * * * * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1leqx5R

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//అనాదిగా..// నేను దుఖః ప్రపంచపు ప్రతీకలని నింపుకున్న సిరాని. కపటానికి, నిర్లక్ష్యానికి, అణగారి అర్ధరాత్రి తెల్లని గోడపై వెలసిన నల్లని అక్షరాన్ని ఇప్పుడు నేను అక్షరాలు పిడికిలైన ఉద్యమాన్ని ఉద్యమం చేపట్టిన ఆయుదాన్ని తూటాలకి ఎదురొడ్డే చాతీని చాతీ నుండి ఎగచిమ్మిన నల్లని రక్తాన్ని అర్ధరాత్రి తెల్లని గోడపై వెలసిన ఎర్రటి నినాదాన్ని పచ్చటి దారుల కోసం వెతలు పడే దుఖః ప్రపంచపు ప్రతీకని నేను సిరాని...కలాన్ని...అనాదిగా అక్షరాన్ని లక్ష్యం నెరవేరక మళ్ళీ మళ్ళీ పుడుతున్న కవిని....14.04.2014...18.04.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lbhhUj

Posted by Katta

Sri Modugu కవిత

Farewell letter By Gabriel Garcia Marquez If God, for a second, forgot what I have become and granted me a little bit more of life, I would use it to the best of my ability. I wouldn’t, possibly, say everything that is in my mind, but I would be more thoughtful l of all I say. I would give merit to things not for what they are worth, but for what they mean to express. I would sleep little, I would dream more, because I know that for every minute that we close our eyes, we waste 60 seconds of light. I would walk while others stop; I would awake while others sleep. If God would give me a little bit more of life, I would dress in a simple manner, I would place myself in front of the sun, leaving not only my body, but my soul naked at its mercy. To all men, I would say how mistaken they are when they think that they stop falling in love when they grow old, without knowing that they grow old when they stop falling in love. I would give wings to children, but I would leave it to them to learn how to fly by themselves. To old people I would say that death doesn’t arrive when they grow old, but with forgetfulness. I have learned so much with you all, I have learned that everybody wants to live on top of the mountain, without knowing that true happiness is obtained in the journey taken & the form used to reach the top of the hill. I have learned that when a newborn baby holds, with its little hand, his father’s finger, it has trapped him for the rest of his life. I have learned that a man has the right and obligation to look down at another man, only when that man needs help to get up from the ground. Say always what you feel, not what you think. If I knew that today is the last time that that I am going to see you asleep, I would hug you with all my strength and I would pray to the Lord to let me be the guardian angel of your soul. If I knew that these are the last moments to see you, I would say “I love you.” There is always tomorrow, and life gives us another opportunity to do things right, but in case I am wrong, and today is all that is left to me, I would love to tell you how much I love you & that I will never forget you. Tomorrow is never guaranteed to anyone, young or old. Today could be the last time to see your loved ones, which is why you mustn’t wait; do it today, in case tomorrow never arrives. I am sure you will be sorry you wasted the opportunity today to give a smile, a hug, a kiss, and that you were too busy to grant them their last wish. Keep your loved ones near you; tell them in their ears and to their faces how much you need them and love them. Love them and treat them well; take your time to tell them “I am sorry,” “forgive me, “please,” “thank you,” and all those loving words you know. Nobody will know you for your secret thought. Ask the Lord for wisdom and strength to express them. Show your friends and loved ones how important they are to you. Send this letter to those you love. If you don’t do it today…tomorrow will be like yesterday, and if you never do it, it doesn’t matter either, the moment to do it is now. For you, with much love, Your Friend, Gabriel Garcia Marquez

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lbhjeP

Posted by Katta

Jagadish Yamijala కవిత

ప్రేమ ... నువ్వూ -------------------- ప్రేమ చెప్పేది పెదవులు కావు కనులే కనులు చెప్పేవి మాటలూ కావు కవితలు కవిత పుస్తకం కాదు అమ్మాయిలే అమ్మాయిలందరూ పుస్తకం కాదు నువ్వు మాత్రమే... - తమిళ మూలం పళనిభారతి అనుసృజన యామిజాల జగదీశ్ --------------------------------- 18.4.2014 ---------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eFV5P2

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

...॥ కృత్యాద్యవస్థ ॥... మనసు మాటను కవిత్వీకరించాలని ఆరాటపడుతుంటుంది హృదయం . ఆకాశంలో వేలాడే చంద్రున్ని చేరేందుకు నేను వెన్నెల తాళ్లు పేనుతుంటాను. అర్థం నన్ను ఊరిస్తుంటుంది , శబ్దం నన్ను ఉరికిస్తుంటుంది, శబ్దార్థాల అంతర్లయల అలల మీద నా నావ ఊగాడుతుంటుంది. అర్థం కాని అంతర్వాహిని ఏదో నన్ను నడి సముద్రంలోకి నడిపిస్తుంటుంది! శిధిల నౌకా దృశ్య శకలాల మీద నేను తేలాడుతుంటాను ! Dt: 17.04.2014

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaRK86

Posted by Katta

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర//ఆకలి//18.04.2014 బండెడు అంట్లు ముందేసుకొని తోమటం ప్రారంభించిన రంగికి.. మనసేమీ బాగాలేదు..చాలా దిగులుగా వుంది! అకలితో అల్లాడిపోతూ,తనకోసం ఎదురుచూపులు చూసే తన బిడ్డే.. కళ్ళముందు కదులుతున్నాడు! రెండు రోజులుగా పాపం అర్ధాకలితోనే పడుకోబెడుతోంది.. ఈరోజైనా తృప్తిగా,కడుపు నిండుగా బువ్వ పెట్టాలి బిడ్దకి! జీతంలో మిహాయించుకొనేలా,అమ్మగార్ని సొమ్ములడిగైనా, పిల్లాడి ఆకలి తీర్చాలి ఈరోజు! ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయ్.. అమ్మగారిస్తారో లేదో! ముందుగా సొమ్ములడిగితే ఆవిడకి ఎక్కడాలేని అసహనం.. చిర్రు బుర్రుమటూ..ముస్టివాడికేసినట్లు డబ్బు విసురుతుంది! కానీ..బ్రతిమలాడైనా సొమ్ములుతీసుకోవాలి!అవసరం అలాంటిది! అంట్లు పూర్తయ్యాయి..గదులు శుభ్రం చేయడం ప్రారంభించింది.. హాలులో అమ్మగారు,అయ్యగారు,ఇద్దరూ హైరానా పడిపోతున్నారు! ముద్దుగ పెరుగుతున్న చినబాబు ససేమిరా తిననంటున్నాడు.. పాలపరవాన్నం గానీ,నేతి పప్పన్నంగానీ,దగ్గరకు రానీయడంలేదు.. అన్ని రకాలా పళ్లు పెట్టాలనే ప్రయత్నం కూడా అడియాసే అవుతోంది! మరిపించి,మురిపించి,అన్నీ తినిపించాలనే వారిప్రయత్నం..విఫలమౌతోంది ఆకలి లేనట్లుంది మరి! బాబు తినడంలేదనే ఉక్రోషం..చిరాకులు..కోపాలు, తారాస్థాయికి చేరాయి..రోజూ చూసే తంతే ఇది! ఈరోజు మరికొంచెం స్థాయి పెరిగింది!ఇద్దరూ చిటపటలాడుతున్నారు! పని పూర్తయ్యింది..ఇహ సొమ్ములడిగి తీసుకోవాలి! తడిచేతులు పవిటచెంగుతో తుడుచుకుంటూ,అమ్మగారి దగ్గరకెళ్ళింది రంగి ఎర్రబడ్డ ముఖంతో,ఇంకా తనప్రయత్న మానని ఆమె.. ఉగ్ర రూపం దాల్చి,అపర కాళిలా కనిపిస్తోంది! అడ్వాన్స్ అడిగే వాతావరణమే లేదక్కడ! అడిగి,ఆమెతో ఛీ అనిపించుకోవడం ఇష్టంలేక,కష్టంగానే, ఇంటిమొహం పట్టింది రంగి! వట్టిచేతులతో గుడెసె చేరిన ఆమె.. ఆకలితో ఏడ్చే బిడ్డని గుండెలకత్తుకుంది..రాలే కన్నీటిబొట్లతో.. .....18.04.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eFIKuf

Posted by Katta

Kamal Lakshman కవిత

మా ఆసరా చిత్ర సౌరభాలు లో విజేత గా నిలిపిన నా కవిత... స్వేచ్చా భారతం....... ఈ అనంత విశ్వంలో మా దేశ ఘనత అపూర్వం, అమోఘం, అనిర్వచనీయం ఎక్కడా లేని స్వేచ్చా, స్వాతంత్ర్యాలకు మారు పేరు మా ఘన భారతం స్త్రీ ఆదిశక్తి,యని, పరాశక్తి యని అడుగడుగునా అందలమెక్కించటం స్త్రీలను గౌరవించటం, మహిళలకు పెద్ద పెద్దపీటలు వేయటం మా రివాజు పవిత్రత, పరిశుభ్రతల గురించి అను నిత్యం ఊదరగొట్టటం మా నైజం ఎదుటి వాళ్ళ తప్పొప్పులను గమనించటం, నిశితంగా పరిశీలించటం నీతులు చెప్పటం, ఆదర్శాలు వల్లించటం ఇది మాకు మాత్రమే చెల్లిన వైనం ప్రతి రోజూ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని దుయ్యబట్టం మా జన్మ హక్కు నిజానికి.... మా ప్రజా ప్రతినిధులకు జేబులు నింపుకోటానికే తీరిక లేదు పాపం మా మహిళలు విమర్శింటం, చీదరించుకోవటం, మరిచిపోవటం షరా మామూలే ఇక్కడ అనునిత్యం ఇలాంటి దృశ్యాలు అడుగడునా తాండవించచటం మాకు పరిపాటే అయినా ఘనత వహించిన మా భరతావని చరిత సదా శ్లాఘనీయమే... కమల్ 18.04.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r3zRes

Posted by Katta

Yagnapal Raju Upendram కవిత

**పనికొచ్చేది** హోమగుండంలో పూర్ణాహుతైన గుమ్మడికాయలాంటి మెత్తటి రాత్రి ఒకరివెంట ఒకరు ఊరికే పరుగెత్తే పిచ్చికుంకల్లాంటి గడియారపు ముళ్ళు ఆ కాసేపటికీ హస్తభూషణమయ్యే పెద్ద కప్పులోని టీ అంటే నాకన్నా వాటికే ఇష్టం కప్పును పట్టుకునే చేతి వేళ్ళనూ తాకీ తాకనట్టు తాకే పెదాలనూ చప్పరించే నాలుకనూ చూస్తూ కప్పులోని టీ అయిపోయేంతవరకూ రాత్రి గడియారం అలానే నిల్చుండిపోతాయి అలా రాత్రిని కాలాన్ని నిలబెట్టే టీ కోసం స్టవ్ రోజూ ఎదురుచూస్తుంది ఒక్కో తేనీటి చుక్క గొంతుదిగే ఒకానొక జ్ఞాపకం నిజంగా జీవితంలోకి వెళ్లాలనుకున్నపుడు పనికొస్తుంది http://ift.tt/1bthiZX

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

నవ్వుల నజరానా -------------------రావెల పురుషోత్తమరావు అడుగులు తడబడకుండా అడుగులో అడుగులు అడుగువేస్తూ వయసు నొసలుపై గీసిన ముసలిరేఖలతో ముసిముసి నవ్వుల ముసలవ్వ జామపండ్ల బుట్టను కడుజాగ్రత్తగానూ భారంగానూ మోస్తూ. అమ్మగుర్తుకొచ్చింది ఆ క్షణాన. దజను పండ్లనుకొని జాగ్రత్తగా పొదవి పట్టుకుని సంచిలోదాచుకున్నాను ఉచితంగా అందుకున్న ఆమె చిరునవ్వులను నన్ను చిన్నప్పుడే దాటిపోయిన అమ్మను అదేపనిగా తలచుకుంటూ ఆమెనవ్వులతో ఏకంగా సరిపోల్చుకుంటూ గుండెనిండా హాయిని నింపుకుంటూ. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^18-4-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qQhaN4

Posted by Katta

Abd Wahed కవిత

ఉర్దూ కవిత్వ నజరానాలో గత కొన్ని వారాలుగా మనం గాలిబ్ కవిత్వాన్ని చదువుతున్నాం. ఈ వారం గాలిబ్ సంకలనంలోని 15వ గజల్ మొదటి షేర్లు చూద్దాం షబ్ కీ బర్కె సోజె దిల్ సే జహ్రా యె అబ్ర్ ఆబ్ థా షోలా యే జవ్వాలా హర్ ఎక్ హల్కా యె గర్దాబ్ థా ఈ రేయి, గుండెమంటలకు మబ్బు నీరుగారిపోయింది మనసువేడి సెగతో నీటిసుడిగుండం అగ్నిగుండమయ్యింది ఈ కవితలో ఉర్దూ పదాలను చూద్దాం. బర్క్ అంటే విద్యుత్తు లేదా మెరుపు, బర్క్ యె సోజె దిల్ అంటే బాధాతప్త హృదయంలోని మంటల మెరుపు. జహ్రా అంటే పిత్తాశయం దీన్ని ఉర్దూలో పిత్తా అని కూడా అంటారు. పిత్తా పాని పానీ హోనా అనేది ఒక సామెత. అంటే అర్ధం భయంతో నీరుగారిపోవడం. పై కవితలో జహ్రా యే అబ్ర్ ఆబ్ థా అని గాలిబ్ వాడాడు. పిత్తా పానీ పానీ హోనా అనే సామెతను తన కవితకు తగినవిధంగా మార్చుకున్నాడు. అబ్ర్ అంటే మబ్బు, ఆబ్ అంటే నీరు. మబ్బు భయంతో నీరుగారిపోయిందన్నది ఈ పంక్తి భావం. జవ్వాలా అంటే తిరిగేది లేదా పరిభ్రమించేది అని అర్ధం. గర్దాబ్ అంటే సుడిగుండంలో కేంద్రం, ఇంగ్తీషులో vortex. షోలా అంటే నిప్పుకణం. ఈ కవితలో నీరు నిప్పుల వైరుధ్యాన్ని వాడుకున్న విధానం గమనించదగ్గది. ఈ కవిత అతిశయోక్తులతో విరహబాధను వర్ణించిన కవిత. ప్రేయసి వస్తానని మాట ఇచ్చి రాని రాత్రి ఎలా గడిచిందో గాలిబ్ ఇందులో వర్ణించాడు. ఆమె వచ్చి కలుస్తానని చెప్పంది. కాని రాలేదు. వర్షం కురుస్తుంది కాబట్టి రాలేదన్న సాకు చెప్పింది. ఈ కవితలో గాలిబ్ అనితరసాధ్యమైన కల్పన, ఊహాశక్తితో వర్ణించిన దృశ్యం ఆ విరహం ఎలాంటిదో చెబుతోంది. రాలేదన్న నిరాశ, ఎడబాటు విరహం ఇవి రెండు కలగలిసిన స్థితి. దుఃఖంతో మనసు రోదిస్తుంది. కన్నీళ్ళు ప్రవహిస్తాయి. గుండెలో మంటలు చెలరేగుతాయి. ఎగసిపడే గుండెమంటలను చూసి ఆకాశంలో మబ్బులు భయంతో నీరుగారిపోయాయట. ఆ నీటిలో సుడిగుండాలు ఆయన గుండెవేడి వల్ల అగ్నిగుండాల్లా మారాయంటున్నాడు. ఆకాశంలో కనిపించే మెరుపులను మబ్బుల్లో కురిసే నీటినే ఆయన వర్ణించాడు, కాని తన మనోస్థితిని, తనలో విషాదపు కన్నీళ్ళు, విరహపు మంటలను ఆకాశంలో మబ్బునీళ్లుగాను, మబ్బుల్లో మెరుపులు పిడుగుల అగ్నిగుండాలుగాను మార్చేశాడు. రెండవ కవిత వాం కరమ్ కో ఉజ్రె బారిష్ థా అనాగీరె ఖుర్రామ్ గిర్యా సే యాం పంబా యె బాలిష్ కఫె సైలాబ్ థా అక్కడ ఆమె నడకకు కురిసే వర్షం కళ్ళెమయ్యింది ఇక్కడ విరహబాధతో తలగడలో దూది కన్నీటిపై నురగయ్యింది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. వాం అంటే అక్కడ. కరమ్ అంటే దయచూపే వారు (ఇక్కడ ప్రేయసి అని అర్ధం). అనా అంటే కళ్ళెం. అనాగీర్ అంటే కళ్ళెం లాగేవారు. ఖిరామ్ అంటే మందగమనం, వయ్యారంగా నెమ్మదిగా నడవడం. గిర్యా అంటే దుఃఖం, యాం అంటే ఇక్కడ. పంబా అంటే దూది, బాలిష్ అంటే తలగడ. పంబా యే బాలిష్ అంటే తలగడలోని దూది. కఫ్ అంటే నురగ, సైలాబ్ అంటే వరద. కఫె సైలాబ్ అంటే వరదపై కనబడే నురగ. ఈ కవితలో కూడా విరహబాధను గాలిబ్ అతిశయోక్తులతో వర్ణించాడు. ఇచ్చిన మాట తప్పిన ప్రేయసి రాలేదు. రాకపోడానికి కారణం వర్షం. వర్షం వల్ల ఆమె రాలేనంది. తనపై దయచూపి కలవడానికి వస్తానన్నఆమె వయ్యారపు మందగమనానికి వర్షం కళ్ళెం వేసిందని వాపోతున్నాడు. అక్కడ ఆమె వర్షం సాకు చెప్పి రానంది, కాని ఇక్కడ ఆమె కోసం ఎదురు చూస్తూ, విరహంతో గాలిబ్ దుఃఖిస్తున్నాడు. ఆ దుఃఖాన్ని వర్ణించిన తీరు గమనించదగ్గది. అక్కడ ఆమె వర్షం సాకు చెప్పింది కాని ఇక్కడ దుఃఖంతో కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి. తలగడపై శిరస్సు తాకిడికి లోపలి దూది బయటకు వచ్చింది. అది కన్నీళ్ళ వరదపై నురగలా మారింది. విరహబాధను అతిశయోక్తులతో వర్ణించినట్లు కనిపించినా ఆ బాధను చవిచూసిన వారికి ఇందులో అతిశయం ఏమాత్రం లేదనిపిస్తుందేమో... మూడో కవిత వాం ఖుద్ ఆరాయీ కో థా మోతీ ఫిరోనే కా ఖయాల్ యాం హుజూమె అష్క్ మేం తారె నిగాహ్ నాయాబ్ థా అక్కడ సింగారించుకుంటూ ముత్యాలు దండలో కూర్చడం ఇక్కడ కన్నీళ్ళ వరుసను చూపుల దారంలో కూర్చడం ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. వాం అంటే అక్కడ, ఖుద్ ఆరాయీ అంటే తన్ను తాను సింగారించుకోవడం, అలంకరించుకోవడం. మోతీ అంటే ముత్యాలు. ఫిరోనే దండకూర్చడం. మోతీ ఫిరోనె కా ఖయాల్ అంటే ముత్యాల దండ కూర్చేపనిలో నిమగ్నం కావడం. యాం అంటే ఇక్కడ. హుజూమె అష్క్ అంటే కన్నీళ్ళ వరద. తారె నిగాహ్ అంటే చూపుల దారం. నాయాబ్ అంటే అలభ్యం. ఈ కవిత కూడా అతిశయోక్తులతో కూడుకున్నదే. పై రెండు కవితల్లో ప్రేయసి ఇచ్చిన మాట తప్పడం, విరహబాధ గురించి రాశాడు. ఎడబాటుతో కూడిన ఆ రాత్రి గురించి వర్ణిస్తున్నాడు. వర్షం సాకు చెప్పిన ఆమె అక్కడ సింగారించుకుంటూ ముత్యాల దండ కూర్చుతోంది. కాని ఇక్కడ విరహబాధతో కన్నీళ్ళు వరదయ్యాయి. కన్నీటి బొట్టును ముత్యంగా వర్ణిస్తూ కన్నీటి బొట్లు వరుసగా చూపుల దారంలో కిక్కిరిసిపోయాయని, అందువల్ల చూపుల దారం కనబడకుండా పోయిందంటున్నాడు. అంటే కన్నీటితో చూపు ఆనడం లేదు, ఏదీ కనబడడం లేదు. కన్నీటి దండ చూపుల దారంలో కూర్చడం వల్ల చూపు నాయాబ్ (అలభ్యం) అయ్యింది. ఈ కవితలో గాలిబ్ ఎక్కడ పోలికలు, ప్రతీకలు వాడలేదు. కాని రెండు సంఘటనలను చెప్పాడు. కవితా నిర్మాణంలో ఇది గమనించదగింది. ఉర్దూ పంక్తిలో గాలిబ్ కన్నీటి బొట్టును ముత్యంతో పోల్చలేదు. అక్కడ ఆమె ముత్యాలు దారంలో కూర్చుతోంది. ఇక్కడ కన్నీటి బొట్లను చూపుల దారంలో కూర్చుతున్నానని మాత్రమే చెప్పాడు. ఇద్దరు చేస్తున్న పని ఒక్కటే. ప్రేయసి తన సింగారానికి ముత్యాలు దండ కూర్చుతోంది. ప్రియుడు విరహంతో చూపులదారంలో కన్నీళ్ళను కూర్చుతున్నాడు. ఇక్కడ గమనించదగిన మరో విషయమేమంటే, ఆమె మరింత అలంకరించుకోడానికి చేస్తున్న పని ఇక్కడ విరహబాధను మరింత పెంచే పనిగా మారుతోంది. ఇలాంటి కవితానిర్మాణ కౌశలం గాలిబ్ కే సాధ్యం. ఇది ఈ వారం గాలిబానా. వచ్చే వారం మరిన్ని కవితలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RsPMIX

Posted by Katta