పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Phanindrarao Konakalla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Phanindrarao Konakalla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జూన్ 2014, మంగళవారం

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర//క్రోధం//03.06.2014 ఆకాశాన్ని,భూమినీ కలుపుతూ.. తళుక్కుమంటున్న కాంతిరేఖలు.. విశాల గగనంలో ..ఫ్లోరసెంట్ పెన్సిల్తో పిచ్చిగీతలు గీస్తున్నట్లుగా, మెరుపులు.. ఆ వెంబడే ప్రళయగర్జన చేస్తూ ఉరుములు! వెయ్యి సింహాలు ఒక్కసారి అరుస్తున్నంత భయంకరంగా! ఉలిక్కి పడి లేచింది ఊరు.. అంధకారంలో..భయంగుప్పుట్లో..ప్రజలు! పిడుగుపాటుకి ప్రాణాలొదిలిన ఎందరో.. దురదృస్టవంతులు! పిడుగులు పడతాయని ముందే లెఖ్ఖగట్టిన శాస్త్రం! గర్జించిం.గర్జించి..అలసిన మేఘాలు, కుంభవృస్టితో చల్లబడ్డాయి! జోరున వర్షం! ఎడతెరిపిలేకుండా కురుస్తోంది! సముద్రంలో సుడిగాలులట.. ఉప్పెనలై ముంచుకొచ్చే ప్రమాదమట! పసిగట్టిన శాస్త్రజ్ణుల హెచ్చరికలు! ఫలితం మాత్రం శూన్యం! ఊహించనిరీతిలో.. ఊళ్ళన్నీ సముద్రంలో కలిసిపోయాయి! నిశ్శబ్దాన్ని చీల్చుతూ.. మా ముద్దు పప్పీ.. మొరుగుతోంది, ఏదోహెచ్చరిక చేస్తూ.. ప్రశాంతమైన పున్నమిరాతిరి, ఒక్కసారిగా హాహాకారాల మధ్య అట్టుడికింది! భూమాత కుదిపిన రెండే రెండుకుదుపులు.. కుప్ప కూలిన కట్టడాలు.. కట్టడాలక్రింద నుజ్జయిన ఎన్నొ శరీరాలు.. రిక్టరుపై..లెక్కలు చెప్పిన శాస్త్రజ్ణులు! ప్రకృతిని పరిశీలించి..పరిశొధించి, ఆమె కోపతాపాలని ఖచ్చితంగా లెఖ కట్టే శక్తి మనిషి సొంతం ఇప్పుడు! కానీ... ఆమె క్రోధాన్ని ఆపే శక్తి.. పచ్చదనాన్ని విచ్చిన్నం చేస్తున్న మనకుందా? .....03.06.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kkv1ep

Posted by Katta

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర//ఆకలి//18.04.2014 బండెడు అంట్లు ముందేసుకొని తోమటం ప్రారంభించిన రంగికి.. మనసేమీ బాగాలేదు..చాలా దిగులుగా వుంది! అకలితో అల్లాడిపోతూ,తనకోసం ఎదురుచూపులు చూసే తన బిడ్డే.. కళ్ళముందు కదులుతున్నాడు! రెండు రోజులుగా పాపం అర్ధాకలితోనే పడుకోబెడుతోంది.. ఈరోజైనా తృప్తిగా,కడుపు నిండుగా బువ్వ పెట్టాలి బిడ్దకి! జీతంలో మిహాయించుకొనేలా,అమ్మగార్ని సొమ్ములడిగైనా, పిల్లాడి ఆకలి తీర్చాలి ఈరోజు! ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయ్.. అమ్మగారిస్తారో లేదో! ముందుగా సొమ్ములడిగితే ఆవిడకి ఎక్కడాలేని అసహనం.. చిర్రు బుర్రుమటూ..ముస్టివాడికేసినట్లు డబ్బు విసురుతుంది! కానీ..బ్రతిమలాడైనా సొమ్ములుతీసుకోవాలి!అవసరం అలాంటిది! అంట్లు పూర్తయ్యాయి..గదులు శుభ్రం చేయడం ప్రారంభించింది.. హాలులో అమ్మగారు,అయ్యగారు,ఇద్దరూ హైరానా పడిపోతున్నారు! ముద్దుగ పెరుగుతున్న చినబాబు ససేమిరా తిననంటున్నాడు.. పాలపరవాన్నం గానీ,నేతి పప్పన్నంగానీ,దగ్గరకు రానీయడంలేదు.. అన్ని రకాలా పళ్లు పెట్టాలనే ప్రయత్నం కూడా అడియాసే అవుతోంది! మరిపించి,మురిపించి,అన్నీ తినిపించాలనే వారిప్రయత్నం..విఫలమౌతోంది ఆకలి లేనట్లుంది మరి! బాబు తినడంలేదనే ఉక్రోషం..చిరాకులు..కోపాలు, తారాస్థాయికి చేరాయి..రోజూ చూసే తంతే ఇది! ఈరోజు మరికొంచెం స్థాయి పెరిగింది!ఇద్దరూ చిటపటలాడుతున్నారు! పని పూర్తయ్యింది..ఇహ సొమ్ములడిగి తీసుకోవాలి! తడిచేతులు పవిటచెంగుతో తుడుచుకుంటూ,అమ్మగారి దగ్గరకెళ్ళింది రంగి ఎర్రబడ్డ ముఖంతో,ఇంకా తనప్రయత్న మానని ఆమె.. ఉగ్ర రూపం దాల్చి,అపర కాళిలా కనిపిస్తోంది! అడ్వాన్స్ అడిగే వాతావరణమే లేదక్కడ! అడిగి,ఆమెతో ఛీ అనిపించుకోవడం ఇష్టంలేక,కష్టంగానే, ఇంటిమొహం పట్టింది రంగి! వట్టిచేతులతో గుడెసె చేరిన ఆమె.. ఆకలితో ఏడ్చే బిడ్డని గుండెలకత్తుకుంది..రాలే కన్నీటిబొట్లతో.. .....18.04.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eFIKuf

Posted by Katta

17, ఏప్రిల్ 2014, గురువారం

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర// ఉదయం.. కవి హృదయం //17.04.2014 నడుస్తున్నా.. పొద్దుపొడవని ఉదయాన, ఊహలు నిండిన హృదయంతో, ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ, నన్ను నేను మరచి.. నడుస్తున్నా! మంచువానలో స్నానమాడి, తడిచెదరని ఒంటిపై, అక్కడక్కడా నీటిముత్యాలద్దుకొని, చెమ్మ వాసనలని అందిస్తూ, కనులవిందు చేస్తోంది..దారికి ఇరువైపులా.. ఒత్తుగా పెరిగిన పచ్చిక. పచ్చ చీరపై తెల్లటి చుక్కలద్దినట్ల్లు, చిన్ని చిన్ని గడ్డిపూలు, చిరుగాలికి తలలూపుతూ.. చిత్రంగాకదులుతున్నాయి! ఈ అందాలని,మరింత అందంగా చూపగల మంచి ఛాయాగ్రాహకుడిని కాకపోతినే! ఎత్తుగా దట్టంగా పెరిగిన చెట్లు..చిక్కగా అల్లుకున్న పొదలు, పొదలపై అటూ ఇటూ చిందులువేస్తున్న పక్షుల కుహు కుహులు.. ప్రతి కుహు కుహులోనూ పలుకు తోందో రాగం మరి ఈరాగాల పరవశంలో ప్రతిస్పందించి, సుమధుర రాగాలు సృస్టించడానికి నేనో సంగీత సామ్రాట్టుని కాకపోతినే! దూరాన ఎత్తయిన కొండలు.. కొండలమీంచి దుముకుతున్న జలపాతాలు పొగమంచు పరదాలమాటున దూరంగా విసిరేసినట్లు, అక్కడక్కడా రెల్లిపొదరిళ్ళు చూడటానికి మనోహర దృశ్యకావ్యం! ఈ ప్రకృతి అందాలను చిత్రించగల ప్రతిభే ఉంటే అదో కళాఖండం కాదా మరి? అయ్యో అంత ప్రతిభగల చిత్రకారుణ్ణి కాకపోతినే! నడుస్తున్నా.. ప్రతి ఉదయం నడుస్తూనే వున్నా.. చూస్తున్నా.. ప్రతి రోజూ చూస్తూనేవున్నా.. ఈ ప్రకృతి సౌందర్యాలు! ఈ అందాలని అనుభవిస్తూ..చిత్రమైన భావోద్వేగంతో.. ఈ అనుభూతులను కవితాక్షర ముత్యాలుగా పేర్చి, ఓ కవితకి రూపమిచ్చి,ఆనందించే.. ఓ చిన్ని కవిని మాత్రమే ! .......17.04.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qM9yew

Posted by Katta

16, ఏప్రిల్ 2014, బుధవారం

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర//హైకూ హారం-4//16.04.2014 ఆక్వేరియం.. అక్కడక్కడే ఈదుతూ చేపపిల్లలు, స్వేఛ్చకు సంకెళ్ళు! రంగుల చీరల్లో.. పూలవేదికలపై ఆడుతూ.. సీతాకోకచిలుకలు! పాత పట్టుచీర.. ఉయ్యాలయ్యింది పాపకి, అమ్మే కనిపిస్తోంది! మంచుకడిగిన.. అందమైన పూలు, నిద్రలో పాపాయినవ్వులు.. కొంగకి చిక్కిన చేప.. ఒకరికి మరణం, మరొకరికి జీవనం! వానచినుకులు.. నదిలోకిదూకి ఆడుకుంటున్నాయ్! నీటిబుడగలతో! వానవెలిసింది.. ముస్తాబవుతున్న చెట్లాకులు, ముత్యాల దండలతో! పచ్చని పైరు.. కలుపుమొక్కలు పీకేయ్! జీవితం సుఖమయం! శాంతి పావురం.. చంపినా..ఎగరెసినా.. నీవ్యక్తిత్వమే! శ్రీమతిని.. విసిగిస్తున్న బాబు, అమ్మగుర్తొచ్చింది! ........16.04.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eGPl8b

Posted by Katta

10, ఏప్రిల్ 2014, గురువారం

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర//ప్రేమంటే?//09.04.2014 అక్కున చేర్చుకొని,గిండెలకత్తుకొని, ముద్దులతో,మురిపాలతో.. అనుక్షణం,నన్ను చూసుకొని,పొంగిపోయే.. అమ్మ,నాన్నల,ప్రేమే ప్రేమంటే అనుకొనే.. చిన్ననాటి రోజుల్లో... ఒక్క ఐస్క్రీం కొనుక్కొని మరొక్కటి సీత కోసం కొనుక్కెళ్లితే బావుణ్ణు.. అనిపించే ఆ చిన్న హృదయంలో మెరిసే మెరుపే, ప్రేమని అప్పుడు తనకు తెలియదు! నిక్కర్ల నుంచి ఫాంటులకి మారిన రోజుల్లో, గౌనులనుంచి లంగా ఓణీలకి మారిన సీతతో, ఎంత సమయం కబుర్లతోగడిపినా.. ఇట్టే గడిచిపోయినట్లనిపించడం, నిద్ర లేవడమే,పక్కింటి పెరట్లో.. పువ్వులు కోసుకొనే సీత కోసం వెంపర్లాడటం, చూసిన క్షణం నుంచీ, చెప్పలేనంత ..హాయి! అదే..ప్రేమని యౌవ్వనంలో అప్పుడే అడుగుపెట్టిన తనకి తలియదు! కాలేజీ చదువులకి పట్టణ ప్రయాణం.. సితను చూడకుండా వుండలేనేమో అనే, చిత్రమైన భావన..మదిలో ఆరాటం.. ఏదో పోగొట్టుకుంటున్నట్లనిపించే వెలితి, పైకి చెప్పలేని మూగ వేదన.. అదే ప్రేమంటే..అనికూడా ఆరోజు అర్ధం కాలేదు! కొత్త ఊరు..కొత్త పరిచయాలు.. కాలేజీ మెట్లెక్కాం అన్న ఒకింత గొప్ప భావన! ఎందుకో సుందరి నన్నే చూసి నవ్వుతోంది! నవ్విన ప్రతి నవ్వుకీ హృదయం దూది పింజవుతోంది! సుందరితో మాట్ల్లాడలని వెళ్లటం..మాట్లాడలేకపోవటం! మాటలురాక, మూగవాడయిపోవడం, గలగలా మాట్లాడే సుందరి అందాలని నెమరువేసుకుంటూ, తీయని ఊహల్లో తేలిపోవడం.. ప్రేమటే..ఇదేనేమో మరి! కొంచెం కొంచెం అర్ధం అవుతున్నట్లనిపిస్తోంది! తీయని కలలతో దొర్లిపోయిన కాలేజీ రోజులు! పెద్ద డాక్టరయిపోవాలనే అమ్మ,నాన్నల ఆశలను, నిజంచేసి..నిరూపించిన ఆత్మ సంతృప్తి! సుచిత్రాడాక్టర్ సమయందొరికిన ప్రతి క్షణం.. తనరూంకివచ్చి కబుర్లు చెబుతోంది! వింటున్నంతసేపూ ఏదోతెలియని తన్మయత్వం! వారాంతాలలో..బీచ్ షికార్లకి ఆహ్వానం! ఉప్పొంగే హృదయాలతో..సముద్రపు కెరటాలతో పోటీలు, అలసిన గుండెల్లో ఏదో గుబులు!ఎన్నో ఊసులు. సుచిత్ర సమక్షంలో .. పులకించిపోతున్న హృదయంలో గిలిగింతలు మరి ఈ పులకింతే ప్రేమా? ఏమో! "ఏయ్ మొద్దూ ఎమిటాలోచిస్తున్నావ్?" అంత శ్వేచ్చగా,అంత చనువుగా,అంత ప్రేమగా.. సుచిత్ర అలా పిలిచిన పిలుపులోనే దాగుంది ప్రేమని.. అప్పుడేతెలిసింది! నాకుతెలియదనేమో.. ఐ లవ్ యూ రా! గోముగా అనేసి భుజంపై వాలిపోయింది! అప్పుడే పూర్తిగా తెలిసింది ప్రేమంటే అదేనని !! ………..08.04.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k75djQ

Posted by Katta

25, మార్చి 2014, మంగళవారం

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర// హైకూహారం-3//25.03.2014 1. తళుక్కున మెరుపులు.. ప్రకృతిని చిత్రీకరిసున్నాడుకాబోలు.. చంద్రుడు! 2. పపాయి వెక్కిళ్ళు.. అమ్మవచ్చింది.. ఆగిపోయాయి! 3. చీకట్లో పల్లె.. మత్తుగా నిద్దురోతుంది.. మరమనుషులు లేరుమరి! 4. కస్టించడమే తప్ప దాచుకోవడం తెలియని శ్రమజీవులు.. తేనెటీగలు.. 5. చిన్న వానచినుకు.. ఆవగింజంత విత్తనానికి జన్మిచ్చింది.. ఎంత చెట్టయ్యిందో! 6. నిద్రపోని పిల్లలు.. తీరని ఆరాటాన జంటలు.. రాత్రి పగలయ్యింది! 7. నిజంకాని.. జీవిత సంఘటనలు.. కలలు! 8. ఎర్రబడిన తూరుపు.. నిద్రలేచిన ఊరు.. పరుగులు ప్రారంభం! 9. పిల్లలాడుకొనే.. ప్రాణంపోసుకున్న విమానాలు.. తూనీగలు! 10. అలసిన జీవితం.. శ్రీమతి మళ్ళీ మామిడికాయడిగింది.. సంతొషాన్నివ్వలేదు! ..........25.03.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkAVsU

Posted by Katta