పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Sk Razaq లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sk Razaq లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జూన్ 2014, శుక్రవారం

Sk Razaq కవిత

|| మనిషై పోతున్నా ... || నా మౌనం నన్ను తొలిచేస్తుంది తెలిసిన వేదనను, తెగువ చూపి తొలగించుకోలేని దౌర్భాగ్యాన్ని చూసి నా స్థైర్యం వెక్కిరిస్తుంది నిరుత్శాహాన్ని నీరుగార్చలేని నిర్భాయాన్ని చూసి నాలోని ధైర్యం నన్నుదహించి వేస్తుంది దౌర్బల్యాన్ని దూరం చేసుకోలేని మానసిక వైకల్యాన్ని చూసి నా లోని కరుణ నన్నుపరిహసిస్తుంది సంఘజీవిగా సంఘర్షణల మాయమైన జీవన గమనం లో జయాలనందుకోలేని మానవీయ విలువలను చూసి మనిషినై పోయానో ఏమో బ్రతుకుటకు వేరొకరి బ్రతుకు చిద్రం చెయ్యలేని మనసుతోటి మరుగున పడి పోతున్నా మనిషై పోతున్నా ... || రజాక్ || 13-06-2014 - 19:20

by Sk Razaq



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v9ZQEZ

Posted by Katta

26, ఏప్రిల్ 2014, శనివారం

Sk Razaq కవిత

|| నేనెవరు ?? || గర్భంలో నేనో పసికందును శూన్యంలో నిశ్శబ్దంగా ఎదిగి వాయువుతో ప్రాణమొందిన మాంసపుముద్దను పుట్టగానే నేనో బిడ్డను ప్రపంచానికి పరిచయంచేస్తూ పేరుపెట్టగానే ఓ మతస్తుడను ... కాని నాలో నేను తొంగి చూసుకుంటే నాకే తెలియక, నాలో ఎదిగిన మరో జీవి ఉన్నాడనిపిస్తుంది అందరూ పిలిచేది ఆ మతస్తుడిని మరి పేరే లేని వాడెమో నేనపిస్తుంది ఇంకా లోతుగా విశ్లేషిస్తే నే నడుస్తూ వున్నా, నిదరోతున్న ఎదుగుతూ ఉన్న మౌనంగా ఉన్న మెలుకువగా ఉన్న మాట కలుపుతున్నా జీవానికి నిర్జివానికి మధ్య ఆ అంతరాన్ని నేనేమో అనిపిస్తుంది మట్టిలో, గాలి నీటితో ఎదిగి, నిప్పుతో, కాలి రాలే బుడిద నేనేననిపిస్తుంది .... || రజాక్ || 26/04/2014, 17:25

by Sk Razaq



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h07E3g

Posted by Katta

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sk Razaq కవిత

|| మౌనం తో నువ్వు సంధిస్తున్న ప్రశ్నలు || మౌనం తో నువ్వు సంధిస్తున్న ప్రశ్నలు నా అంతరంగాన్ని చిల్చే వేటగాడి బాణాలు అవుతునాయి సమాధానం సత్యమే అయినా ని తుఫాను హోరుల అలజడిలో అర్ధంకాని భాషగా మిగిలి పోతున్నాయి నీ మౌనం నన్నో మనిషిగా చూస్తున్నట్లుగా లేదు అందుకే మాటలతో చెప్పనియ్యవు.. చెవులను దాస్తావు కనులతో పలుకరించనియ్యవు.. కన్నీటి దారాలు పొంగిస్తావు మనసుతో సంభాషించాలని దగ్గరకు తీసుకుంటే.. కరుకు రోజా పువ్వు ముల్లులా గాయం చేస్తునావు గుండె గాయాలకి పలకరింపులే లేపనం ప్రియా నువ్వు నా జీవితకాల తోడువు మరచిపోకు అభద్దమైతే నమ్మించగలం మరి నిజాన్ని నమ్మించమంటావా ? మరైతే సరే, నే సత్యమే చెబుతున్న కలియుగ శ్రీ రామచంద్రుడిని, ఏక ప్రియ, పత్ని వ్రతుడను , పెళ్ళికి ముందు ప్రియురాలు, పెళ్లి తరువాత ఇల్లాలు ఇద్దరూ ఒక్కరే అంటే ఇంకా నమ్మవెం ? సాక్ష్యం చుపమంటావా? నా అంతరంగాన్ని స్పృశించి చూడు ని అబద్ధమైన శoశయా అంతమైపోతుంది నీలో ని ఆ ఇద్దరూ ఒకటే అని తెలుసోస్తుంది. || రజాక్ || 18-04-2014, 13:43

by Sk Razaq



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f13Gqt

Posted by Katta

27, మార్చి 2014, గురువారం

Sk Razaq కవిత

|| ఇంకా ఎందుకు మౌనం ? || రజాక్ ఇంకా ఎందుకు మౌనం ? ఎన్నికల తుఫాను తీరందాటి హోరేత్తిస్తువుంటే మెలుకువగా ఉంటూ, నిద్ర నటిస్తూ ఇంకా ఎందుకు మౌనం ? నీ ఇంట్లో ప్రతి వస్తువు ధరాఘాతాలతో దాడి చేస్తూ ఉంటే దాగి దాగి, నక్కి నక్కి, దరిద్రాన్ని దుప్పటి గా చేసుకొని, ఇంకా ఎందుకు నిద్ర నటిస్తావ్? కరెంట్ షాకులు, దోమల దాడులు, సర్దుబాటు పోటులు భరిస్తూ ఎన్నాళ్ళు నిన్ను నువ్వు సర్దిచేప్పుకుంటావ్ ? ఇంకా ఎందుకు మౌనం వహిస్తావ్ ? KG నుంచి PG దాక చదువులు చదివి నిశానిగాళ్ళ నవీన దోపిడీకి తెలిసి తెలిసి దాసానుదాసుడవుతావ్ ? సత్య ప్రపంచం ఒక నిత్య నరకం అని తెలిసీ, అది చేదు కలగా భావించి, మెలుకువలోకి రావడానికి ఇంకా ఎందుకు భయపడతావ్ ? ఇంకా ఎందుకు మౌనం ? ఇంకా ఎందుకు మెలుకువగా ఉంటూ నిద్ర నటిస్తావ్? పోటి చేసే ప్రతి నాయకుడు కేడి, రౌడి, డాన్, స్మగ్లర్, యాక్టర్, కాంట్రాక్టర్ అని అన్ని తెలిసి, దోచుకోవడం కోసమే వారు పార్టీల పెట్టారని తెలిసి తెలిసి, కళ్ళు మూసుకొని ఇంకా ఎందుకు పాపం చేస్తావ్ ? మెలుకువగా ఉంటూనే నిద్ర నటిస్తావ్ ? ఇంకా ఎందుకు మౌనం ? ఎంతకాలం సహిస్తావ్ ఇ దారుణం ? వెయ్యి గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానకు గల్లంతౌవుతాయి చలి చీమకు చిక్కిన సర్పమైనా శల్యమౌతాయ్ నిద్రపుచ్చితే పాపాయి నిద్రపోవు, నిద్ర నటిస్తే దేశం, దేశద్రోహులపాలౌ ని ఇంటికి నువ్వు పరిమితమైతే, దేశాభ్యున్నతికి దశదిశా చుపెదేవరు? ని జాతి జాగ్రుతికి కంకణం కట్టేది ఎవరు ? ఇంకా ఎందుకు మౌనం ? మెలుకువగా ఉంటూ, నిద్ర నటిస్తు ఇంకా ఎందుకు మౌనం ? ఓటు నీ ఆయుధం మంచి నాయకుడిని మీరే ఎంచుకోండి, ఎంచుకున్న నాయకుడినే ఒటువేసి గెలిపించుకోండి. దేశ, రాష్ట్ర భవితను మార్చుకోండి ..... జైహింద్. || రజాక్ || 27-03-2014

by Sk Razaq



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFfRyA

Posted by Katta