కోరిక ***** పుంటికూరలో రొయ్యలను కలిపి తినాలని ఉంది జొన్న రొట్టేలో పులసచేపను నంజుకోవాలని ఉంది పోలెల్లో పూర్ణం బదులు బందరు లడ్డు పూతరేకులను పెట్టాలని వుంది అంబలితో సంకటిని కలిపి మేక మాసంతో లోట్టలేయ్యాలని ఉంది ! అన్నదమ్ములతో కలసి కడలి తీరానా ఇసుక తిన్నలపై బొమ్మరిల్లు చేసుకొని ఆడాలని ఉంది శ్రీకాకుళం అడవిలో జీడి గింజలను ఏరుకోవాలని ఉంది అరకు కొండల్లో చలి కాచుకోవాలని ఉంది ! రాజమండ్రిలో వేదం చదవాలని ఉంది కోనసీమ కొబ్బరి నీళ్ళను తాగుతూ పచ్చని కాంతులను మనసున బందించాలని ఉంది బెజవాడ అంచున కృష్ణమ్మ నడకలను చూడాలని ఉంది కొల్లేటి సరస్సులో వలస పక్షులతో మాటకలపాలని ఉంది ! అహోబిలం అడవిలో ఒంటరినై వన్యమృగాలతో ఆడుకోవాలని ఉంది శ్రీహరికోటలో PSLV కి తోడుగా వెళ్ళి భూగోళాన్ని చేతుల్లో పట్టి ముద్దాడాలని ఉంది తిరుపతి ఎంకన్న కొండను కాలినడకన వెళ్ళి ప్రకృతి అందాలను కాంచాలని ఉంది ఇవన్నీ ఇప్పుడు నావికావు పరాయి రాష్ట్రం తెలుగుకు రెండు వెలుగులు అది మాత్రం ఇష్టం గత గాయాలను మాన్పుకొని చల్లబడ్డ మనసులలో కొత్తపూలు పూయాలని ఉబలాటం ! కృష్ణ మణి I 18-04-2014
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pfPALP
Posted by Katta
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pfPALP
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి