పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Harika Haari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Harika Haari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Harika Haari కవిత

ప్రేమ లేకుండా జివించలేమా అంటే జివించగలం , కానీ అలా జివించే జీవితం మోడుబారిన చెట్టు లాంటిదని ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది... అందుకే నీ పై నా ప్రేమ తెలపాలని వచ్చాను ...! కానీ ఈ లోపే నీ మనసు నీలో లేదని తెలిసి మౌనంగా వెనుదిరిగాను... నా ప్రేమను తెలుపలేని పరిస్థితి , నీ ప్రేమను పొందలేని దుస్థితి ...! అయినా వసంతంలో కోకిల గానంలా, నీ ప్రేమకోసం నేను ఎదురుచూస్తుంటాను...! - హారిక / 18/04/2014

by Harika Haari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jcFbru

Posted by Katta

17, ఏప్రిల్ 2014, గురువారం

Harika Haari కవిత

ఇన్ని రోజులు నీకై నేను చేసిన నిరీక్షణ, ఒక్కసారిగా నువ్వు కనపడగానే కనుమరుగై పోయింది...!! నీ చూపుల తాకిడితో నాలో ఉన్న విరహం, ఒక్క ఉదుటన ఎగిరిపోయింది..!! నువ్వు నా సమక్షానికి చేరిన మరుక్షణం , నాలో నీకై పడిన ఆవేదన వాయువులో కలిసిపోయింది...!! నీ కౌగిట నేను బందీ అయిన నిమిషం, నీకై నేను కార్చిన కన్నీరే ఆనంద బాష్పమై నా చెంపను తడిమింది... !! నువ్వు నేను ఒక్కటైన వేళ , నీ ఊపిరే నా ఆయువుగా మారింది ,నీ రూపాన్నే నా ప్రాణంగా మలచింది ...!! అందుకే ..! నువ్వు లేని నా మనసులో నాకైనా చోటు లేదు ...! నువ్వు లేని ఈ లోకంలో (నాకంటూ) బ్రతకాలన్న ఆశ లేదు...!! - హారిక / 17/04/2014

by Harika Haari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hPe8ah

Posted by Katta

Harika Haari కవిత

హారిక / ప్రేమ ఊసులు 17/04/14 ఆశల పందిరి అల్లుతున్నా , అందమైన నీ ప్రేమ ఊసులతో...! మనసు పొదరింటిలో దాచి ఉంచుతున్నా మదురమైన నీ ప్రేమ మాధుర్యాన్ని ...! పెదవులపై పదిలపరచుతున్నా , పరిమళించేటి మన ప్రణయ గాధను...! హృదయమందిరంలో కొలువుంచుతున్నా , నా హృదయాంతరంగాన్ని మీటేటి నీ అందమైన ప్రతిరూపాన్ని..! కనుల కొలనులో వికసిస్తున్నా , కనుమరుగవని నీ కన్నుల కాంతి రేఖనై ... మన ఇద్దరి కలయికకై వేచి చూస్తున్నా కోటి కాంతుల ఉషోదయాన్నై ...! - హారిక

by Harika Haari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1laoq2R

Posted by Katta