జాస్తి రామకృష్ణ చౌదరి కమలం తనని చేరాలి తన లోకంలో ఉండి నన్నే పరికిస్తూ నాతో సంబాషిస్తూ ఉన్న ఆ కోమలిని చేరాలి; తన సౌందర్యంతో నన్ను మంత్రముగ్ధుడ్ని చేస్తున్న ఆ కోమలిని చేరాలి కానీ ఎలా? తన చెంతకి చేరడం ఎలా? నాకు తన లోకం లోకి ప్రవేశించడం తెలియదు తను నా లోకంలోకి రాలేదు మరేలా! కానీ మేమిద్దరం ఒకటి కావాలి ఎలా? ఏదో మాధ్యమం కావాలి కదా మేమిద్దరం ఒకటవ్వడానికి; నా చూపులతోనే తనని కౌగిలించుకున్నా ఆ నా చూపుల్లో నా ప్రేమమాధుర్యం నింపి; తను తన నవ్వుల్లో జీవనమాధుర్యం నింపి నన్ను తన హృదయంలో పరుచుకుంటూ ఉంటే తన సౌందర్యంలో హాయిగా జీవిస్తూ నేను! 18Apr2014
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRv4vT
Posted by Katta
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRv4vT
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి