ఫణీంద్ర//ఆకలి//18.04.2014 బండెడు అంట్లు ముందేసుకొని తోమటం ప్రారంభించిన రంగికి.. మనసేమీ బాగాలేదు..చాలా దిగులుగా వుంది! అకలితో అల్లాడిపోతూ,తనకోసం ఎదురుచూపులు చూసే తన బిడ్డే.. కళ్ళముందు కదులుతున్నాడు! రెండు రోజులుగా పాపం అర్ధాకలితోనే పడుకోబెడుతోంది.. ఈరోజైనా తృప్తిగా,కడుపు నిండుగా బువ్వ పెట్టాలి బిడ్దకి! జీతంలో మిహాయించుకొనేలా,అమ్మగార్ని సొమ్ములడిగైనా, పిల్లాడి ఆకలి తీర్చాలి ఈరోజు! ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయ్.. అమ్మగారిస్తారో లేదో! ముందుగా సొమ్ములడిగితే ఆవిడకి ఎక్కడాలేని అసహనం.. చిర్రు బుర్రుమటూ..ముస్టివాడికేసినట్లు డబ్బు విసురుతుంది! కానీ..బ్రతిమలాడైనా సొమ్ములుతీసుకోవాలి!అవసరం అలాంటిది! అంట్లు పూర్తయ్యాయి..గదులు శుభ్రం చేయడం ప్రారంభించింది.. హాలులో అమ్మగారు,అయ్యగారు,ఇద్దరూ హైరానా పడిపోతున్నారు! ముద్దుగ పెరుగుతున్న చినబాబు ససేమిరా తిననంటున్నాడు.. పాలపరవాన్నం గానీ,నేతి పప్పన్నంగానీ,దగ్గరకు రానీయడంలేదు.. అన్ని రకాలా పళ్లు పెట్టాలనే ప్రయత్నం కూడా అడియాసే అవుతోంది! మరిపించి,మురిపించి,అన్నీ తినిపించాలనే వారిప్రయత్నం..విఫలమౌతోంది ఆకలి లేనట్లుంది మరి! బాబు తినడంలేదనే ఉక్రోషం..చిరాకులు..కోపాలు, తారాస్థాయికి చేరాయి..రోజూ చూసే తంతే ఇది! ఈరోజు మరికొంచెం స్థాయి పెరిగింది!ఇద్దరూ చిటపటలాడుతున్నారు! పని పూర్తయ్యింది..ఇహ సొమ్ములడిగి తీసుకోవాలి! తడిచేతులు పవిటచెంగుతో తుడుచుకుంటూ,అమ్మగారి దగ్గరకెళ్ళింది రంగి ఎర్రబడ్డ ముఖంతో,ఇంకా తనప్రయత్న మానని ఆమె.. ఉగ్ర రూపం దాల్చి,అపర కాళిలా కనిపిస్తోంది! అడ్వాన్స్ అడిగే వాతావరణమే లేదక్కడ! అడిగి,ఆమెతో ఛీ అనిపించుకోవడం ఇష్టంలేక,కష్టంగానే, ఇంటిమొహం పట్టింది రంగి! వట్టిచేతులతో గుడెసె చేరిన ఆమె.. ఆకలితో ఏడ్చే బిడ్డని గుండెలకత్తుకుంది..రాలే కన్నీటిబొట్లతో.. .....18.04.2014
by Phanindrarao Konakalla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eFIKuf
Posted by Katta
by Phanindrarao Konakalla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eFIKuf
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి