పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి సంగ్రామం కాసేపు కాలాన్ని నిలిపేద్దాం ఎందుకంటే, ముందుకు పోయాకా వెనక్కి రావడం కష్టం కదా ఇప్పుడు, ఇక్కడే ఆగాలి మనం ముందుకు సాగాలంటే, ఇహ ఇక్కడ ఆగక తప్పదు ఇప్పుడొకసారి మన అంతరాత్మ మాట విందాం ఎన్నో సార్లు తన మాటని పెడచెవిన పెట్టాము మనం అందుకే మనం మనల్ని కోల్పోయాం ఐనా తను మనతోనే ఉంది, మనలోనే ఉంది మన బాగు కోసం, మన భవిష్యత్తు కోసం కాబట్టి ఈ సారైనా తన మాట, తన పాట విందాం అదిగో; సంగ్రామం ముంచుకొస్తోంది అదిగో, రాజులు, మంత్రులు, సేనాధిపతులు వాళ్లంతా మన తరపున యుద్దం చేయడానికి వస్తున్నట్టు నటిస్తూ మనల్ని ఓడించడానికి వస్తున్న ముష్కరులే తమ గుప్పెట్లో మన జీవితాల్ని మరో ఐదు సంవత్సరాలకో, మరో పది సంవత్సరాలకో లేదా తరతరాలకో మనల్ని తమ గుప్పెట్లో బంధించుకోవడానికి వస్తున్న నాయకులే వారు గుప్పెట ఒక తాటాకు మాత్రమే కానీ, మన గుప్పెట ఏకంగా ఒక ఆకాశమే గదా వారి ఉపన్యాసం ఒక విన్యాసమే కానీ మన మౌనం మహా మంత్రం కాదా అందుకే మనం మౌనంగా ఉందాం, మౌనంగా విందాం మనకి తెలుసు ధనికుడు ఇంకా ధనికుడవుతున్నాడు పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు యువత ఉపాధి లేక అల్లాడిపోతోంది సమాజంలో అమానుషం పెట్రేగిపోతోంది దేశాన్ని అవినీతి చీడలా పట్టి పీడిస్తోంది అభివృద్ది కుంటుపడింది దీనికి కారణం ఎవరు? పాలకులు కారా? మరి ఆ పాలకులకి పాలేరుల్లా ఉందామా లేక రాజ్యాంగమిచ్చిన ప్రజాస్వామ్య స్వేచ్చలో పాలకులమే అవుదామా, ఆలోచించండి అదిగో సమరక్షేత్రం సముద్రం ఉప్పెనతో కబళించడానికి సమాయత్తమవుతున్నట్టు కదిలి వస్తోంది రాజకీయప్రవాహం ఐనా మనకేం భయం మనం ఒక ఆకాశసమూహం ఆకాశాన్ని ఏం చేయగలదు సముద్రం వెళ్దాం పదండి సమర క్షేత్రంలోకి మన భవిషత్తు మన తరతరాల భవిష్యత్తు ఇప్పుడు మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంది మన ధైర్యంపైనే, పౌరుషం పైనే ఆధారపడి ఉంది ఈ యుద్దకుయుక్తిలో మనల్ని ఓడించడానికి ఎన్ని దుష్టశక్తులు బయలుదేరుతున్నాయో చూడండి కానీ మనలో ఉన్న ప్రజాశక్తి ముందు అది తల వంచాల్సిందే కనుక లేవండి, నిద్దుర లేవండి పాస్ మార్కులు కూడా లేని ఓట్లతో వాళ్ళని గెలిపిస్తూ మనం ఓడిపోతూ వచ్చాం ఈ ఒక్క రోజు అన్ని సుఖాల్ని వదిలేద్దాం ఆ ఒక్క రోజూ బద్దకాన్ని వదిలేద్దాం ఎండైనా వానైనా సమరక్షేత్రంలో నిలబడి మన చూపుడు వ్రేలునే ఆయుధంగా చేసుకుని మన యుద్దం మనం చేద్దాం అంతరాత్మ చెప్పే నిజానికి ఓటేద్దాం వారు పచ్చనోట్లకి మనల్ని కొని మన పచ్చని కాపురాల్ని దోచుకోజూసుకోవారే కాబట్టి, వాళ్ళ విషవలయంలోకి వాళ్లనే నెట్టుదాం పిల్లలారా, పెద్దలారా, లేవండి, జాగృతం కండి మన హక్కులు మనం సాధించుకుందాం మన సమాజాన్ని మనం నిర్మించుకుందాం మన గొయ్యి మనమే తీసుకునే సంస్కృతికి ఇక ముగింపు పలుకుదాం ఇక లేద్దాం, చైతన్యస్రవంతిలో నడుద్దాం మనలో గూడు కట్టుకున్న అచేతనని ఛేదించి వ్యూహాల్ని భేదిద్దాం, న్యాయాన్ని గెలిపిద్దాం ధర్మస్థాపనకై నడుము బిగిద్దాం సొమ్ములుతో మన జీవితాల్ని కొనచూసే ఆ రాబంధులపై రాళ్లని విసురుదాం అంతే కానీ, ఒక వారం కూలీ డబ్బు కోసం కక్కుర్తిపడి, మన భవిష్యత్తుని అమ్ముకోకుండా మనల్ని మనం రక్షించుకుందాం లేవండి, పిడికిలి లేపుదాం; ఓటుని గుద్దుదాం గుండెలు అదిరేలా ఓటుని గుద్దుదాం ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఓటుని గుద్దుదాం మన జీవితాలకి ఆ చుక్కే ఒక వేగుచుక్కై మన జీవితాల్లో వెలుగు నింపేలా మన అంతిమతీర్పునిద్దాం మన ఓటుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచే నాయకుల గుండెల్లో నిద్దురపోదాం మన పాలన మనమే చేసుకుంటూ ప్రగతిపధంలోకి సాగుదాం! 18Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eHfBiu

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి