...॥ కృత్యాద్యవస్థ ॥... మనసు మాటను కవిత్వీకరించాలని ఆరాటపడుతుంటుంది హృదయం . ఆకాశంలో వేలాడే చంద్రున్ని చేరేందుకు నేను వెన్నెల తాళ్లు పేనుతుంటాను. అర్థం నన్ను ఊరిస్తుంటుంది , శబ్దం నన్ను ఉరికిస్తుంటుంది, శబ్దార్థాల అంతర్లయల అలల మీద నా నావ ఊగాడుతుంటుంది. అర్థం కాని అంతర్వాహిని ఏదో నన్ను నడి సముద్రంలోకి నడిపిస్తుంటుంది! శిధిల నౌకా దృశ్య శకలాల మీద నేను తేలాడుతుంటాను ! Dt: 17.04.2014
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaRK86
Posted by Katta
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaRK86
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి