పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, జూన్ 2014, సోమవారం

Padma Bikkani కవిత

|| అసంపూర్ణ చిత్రం || నిగూఢమైన ఆలోచనలనుంచి జనించిన భావాలు హృదయపు కాన్వాస్ పై గజిబిజి చిత్రరేఖలుగా రూపుదిద్దుకొని ఇమిడి ఇమడని భావాలతో ఓ పికాసో చిత్రంలా, తెలిసితెలియని ఆవేధనలా .... తర్కానికి అందని రోధనలా అరణ్యంలో ఓచోట రాజుకొంటున్న దావానలంలా ఎగిసి పడుతుంది... గుప్పిట బిగించిన అరచేతిలో గీతల్లా, రూపం పోల్చుకోని యాతనలా అచ్చులు హల్లులకి తర్జుమా చేయలేని ప్రకంపనాల్లా.., ముడతలు పడ్డ శరీరంలో వణుకు గీతల్లా రూపాన్ని మారిపోయి జాలిగా చూస్తున్నాయి.... కంటిపోరలలో నీరు తోణికిసలాటకు జీవం కోల్పోయిన ఆకారంలా భాషల లిపిలో ఏరూపంలో దాగక ఉడిగిన జవసత్వాలా నిశబ్ధరోధనై మూగపోతుంది..... గుప్పిట బిగిసిన గీతలు వృద్దాప్యంలో ముడుచుకు పోతు చిట్ట చివరి మజలీల్లో వైవిద్యభరిత శోధనకు నా జిజ్నాసకు అందని పదాలుగా నన్ను వెలివేస్తున్నాయి....!! భావాలకు అనుభవాలల్లి క్రమబద్ధికరించితేనే నీకు నువ్ గీటురాయివి అవుతావు అని వెక్కిరిస్తున్నాయి....!! కానీ, అంతర్మదనంలో అక్షరాలు ఉప్పొంగే అలల్లా నెగ్గటం రాక మళ్ళీ సంద్రంలో సబ్ధువుగా వెనతిరిగి ఓడి నెగ్గటానికి విశ్వప్రయత్నం చేసి మళ్ళీ ఓటమి చేరువని దరిచేరుతున్నాయి ఎప్పటికి నెగ్గని నాలో భావుకునిలా... నా అన్వేషణ అక్షరమై,.... ఆ అక్షరానికి అసంపూర్ణచిత్రంలా వేళ్లాడుతూ మిగతా చిత్రాన్ని గీస్తూ పోతున్నాను ఈ అసంపూర్ణ చిత్రాన్ని సంపూర్ణం చేసేందుకు....!! 2 june14

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iK9h6d

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి