ముళ్లచెట్టుకు పూచిన సుమం Posted on: Mon 02 Jun 00:16:12.837902 2014 తెల్లవారి భావాల్ని మధించి, ధిక్కరించి, జీవిత అనుభవంతో వచ్చిన అనుభూతుల్ని అక్షరాల్లోకి వంపి ముళ్లకంపకు పూసిన సాహిత్య కుసుమం ఆమె. అననుకూల సమయంలో రైతు సేద్యం చేసినట్లు రక్తమోడుతున్న తన జీవితంలోంచే కవిత్వం రచిందామె. బాల్యంలో ఊహించని అనుభవాన్ని చవిచూసినా మానవత్వాన్నే వెదజల్లిన దయార్ద్ర హృదయురాలు ఆమె. జీవితంలో అనేక మలుపులు తిరిగి, కూటికోసం వేశ్య అయిన ఆమె. ఆ పరిస్థితుల్లో ఉండీ కవిత్వం రాయడం గొప్ప విషయమే కదా! ఆమె ఈ నెల 28వ తేదీన మన మధ్య నుంచి మాయమైపోయింది. ఆమె 'మాయా యాంజిలౌ'. మాయా యాంజిలౌ 1928, ఏప్రిల్ 4వ తేదీన సెయింట్ లూయిస్‌లోని మిస్సోరీలో జన్మించారు. ఆమె అమెరికాకు చెందిన నల్లజాతీయురాలు. ఆమె జీవితాన్ని స్పృశిస్తే రచయిత్రిగా ఎదిగే వాతావరణం ఉందా అనిపిస్తుంది. కానీ ఆమె తన చివరి క్షణాల వరకూ ఎంతో ఉత్సాహంగా కవిత్వాన్ని రచించారు. ఆమె ఓ రచయిత్రీ, కవయిత్రీ, జర్నలిస్టు, గాయనీ... ఇలా చాలా పాత్రల్లో తనను తాను ఒంపుకున్నారు. ఆమె ఎనిమిదేళ్ల వయసులో తన తల్లి స్నేహితుని చేతిలో ఘోరమైన అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన తర్వాత ఆమె దాదాపు ఐదేళ్ల పాటు మౌనంగా ఉండిపోయింది. ఆమెను అత్యాచారం చేసిన వ్యక్తిని ఆమె మేనమామలే హత్య చేశారని తెలిసి మరింత మూగవోయింది. 'నేనింకెప్పుడూ మాట్లాడదల్చుకోలేదు. నేను చెప్పటం వల్లనేగా మా వాళ్లు ఆ అబ్బాయిని చంపేశారు. ఇక నేనెప్పుడు నా నోరు విప్పను. బహుశా, నేనే అతన్ని చంపేశానేమో, ఇక నేనేం మాట్లాడినా అది ఎవర్నో ఒకర్ని చంపుతుందేమో!' ... ఇవీ, ఆమె అతడి హత్య గురించి తెలిశాక రాసుకున్న వాక్యాలు. మాయా తన 86 ఏళ్లలో ఏడు ఆత్మకథల్ని రాసుకున్నారు. చరిత్రలో ఎవరూ ఇన్ని ఆత్మకథలు ఇప్పటివరకూ రాసుకోలేదేమో! ఇది అందర్నీ అబ్బురపరిచే విషయమే. ఆమె రాసిన వ్యాసాలతో మూడు పుస్తకాలు, బోలెడన్ని కవిత్వ సంపుటాలూ వెలువడ్డాయి. నల్లజాతీయులందరిలానే ఆమె కూడా తిండికి నకనకలాడింది. అందుకు ఏ పని చేయడానికీ ఆమె వెనుకాడలేదు. ఆఖరుకు వేశ్యా గృహపు కార్యనిర్వహణాధికారిగా, వేశ్యగా, రాత్రి క్లబ్ డ్యాన్సర్‌గా పని చేశారు. వంటమనిషిగా కొన్ని క్రిస్టియన్ సంస్థల్లో పనిచేశారు. జర్నలిస్టుగా, నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా .... ఇలా బహుముఖ ప్రజ్ఞగా ప్రవహించారు. అనేక చిత్రాల్ని, టెలివిజన్ కార్యక్రమాల్ని రూపొందించారు. 1982లో ప్రొఫెసర్‌గా జీవితం మొదలైంది. ప్రజల హక్కుల కోసం జరిగే ఉద్యమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. నల్లజాతీయ మహిళల గొంతుకగా పేరొందారు. తన జీవితంలో ముగ్గురిని వివాహమాడింది. ఆమె 'ది పర్పిల్ ఆనియన్'లో నాట్యం చేస్తున్నప్పుడు పరిచయమైన వాళ్లలో టోష్ ఏంజెల్స్ ఒకరు. అతనితో కలిసి ఆమె మరిన్ని డ్యాన్స్‌లు చేసి, చివరిగా కాలిప్సో డాన్సర్‌గా స్థిరపడ్డారు. డ్యాన్సర్‌గా అనేక ప్రదర్శనల అనంతరం ఆ వృత్తి నుంచి విరమించుకున్నారు. 1959లో నవలాకారుడు జేమ్స్ ఓ.కిల్లెన్స్‌ని కలిశాక ఆమె జీవితం మరో దశ తిరిగింది. అతని ప్రభావంతో ఆమె నవలలు రాయటం ఆరంభించారు. ఆ ప్రక్రియలో విజయం సాధించారు. 1970లో ఓప్రా విన్ఫ్రే పరిచయమయ్యాక ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. 1973 లో పౌల్ డ్యూ ఫ్యూతో మళ్ళీ పెళ్లి అయ్యి, 1981లో విడాకులు అయ్యాయి. ఆ ఏడాదే (1981లో) ఆమెకి వేక్ ఫారెస్ట్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమెకో అరుదైన అవకాశం లభించింది. అది ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె తన కవితను వినిపించటం. అదీ, ఓ నల్ల జాతీయురాలు. ఆమెని ఆహ్వానించింది కాబోయే అధ్యక్షుడు బిల్ క్లింటన్. ఆమె తన కవిత నిఉఅ ్‌ష్ట్రవ ూబశ్రీరవ శీట వీశీతీఅఱఅస్త్రు చదివారు. 1961 తర్వాత జాన్ ఎఫ్ కెన్నడీ ప్రమాణ స్వీకారోత్సపు సభలో రాబర్ట్ ఫ్రాస్ట్ చదవడం మొదలైతే, తర్వాత అలా చదివే అవకాశం వచ్చింది మాయాకే. బారక్ ఒబామా అమెరికా అధ్యక్షులయ్యాక ఆమె ఇలా అంది : నిఔవ aతీవ స్త్రతీశీషఱఅస్త్ర బజూ bవyశీఅస ్‌ష్ట్రవ ఱసఱశీషఱవర శీట తీaషఱరఎ aఅస రవఞఱరఎు. మాయా యాంజిలౌను 2011లో బారక్ ఒబామా 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' తో సత్కరించారు. ఆమె ఓ ఉన్నతికి ఎదిగాక ప్రంచంలోని ముఖ్య సంస్థలన్నీ ఆమెని గౌరవించి, తమకి తామే గౌరవాన్ని ఆపాదించుకున్నాయి. ఆమెకు 30 పైగా గౌరవ డాక్టరేట్లు వచ్చాయి. గత ఏడాది దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలా మరణించినప్పుడు ఆమె రాసిన కవిత, నినఱర ణay ఱర ణశీఅవు . ఆమె చివరి కవిత కూడా అదే! 'స్వేచ్ఛ పిట్ట గాలి వీపునెక్కి ఎగురుతూనే ఉంటుంది. కిందకు తనను తాను దింపుకుంటూ గాలినెదిరిస్తూ సూర్య కిరణాల నారింజ రంగుల్లో తన రెక్కల్ని విప్పార్చుకుంటూ ఆకాశం నాదేనంటూంది...' అనే కవిత ఆమె ప్రతీకలకో మచ్చుతునక. ఇది 1969లో ప్రచురితమైంది. అదే ఆమెను మొదటిసారి వెలుగులోకి తెచ్చింది. ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళ ఆ స్థాయిలోకి రావడం అరుదైన విషయమే! ఆమె సాహిత్య ప్రస్థానం 1969లో మొదలై ... చనిపోయే వరకూ అంటే 2014 వరకూ కొనసాగింది. ఆమె రచనలన్నీ ఆంగ్లంలోనే సాగాయి. ఆమె జీవితంనిండా ఎన్నో ఒడుదుడుకులు ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ ఆమె ముందుకే సాగింది. నిరాశా నిస్ప ృహ నిస్సత్తువా ఎక్కడా ఆవరించకుండా ఇంతింతై ఎదిగింది. వివక్షకు, అణచివేతకు వ్యతిరేకంగా సాహిత్య కేతనమై సగర్వంగా ఎగిరింది. ఆమె జీవితం, సాహిత్యం రెండూ వేర్వేరు కాదు.. అవి రెండూ స్ఫూర్తిదాయకాలే! పరిస్థితులు సానుకూలంగా లేవని చెప్పి, రచనలు చేయకుండా తప్పించుకునేవారు రాయడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి. - శాంతిశ్రీ 98663 71283http://www.prajasakti.com/mm/20140602//3.jpg.1401668167
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wQlQXb
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wQlQXb
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి