తెలంగాణ భాగ్య గీతి రచన : డా. ఆచార్య ఫణీంద్ర ‘అరువది తొమ్మిది’న్ మరియు నా పయి రేగిన ఉద్యమాలలో ఒరిగిన కంఠ మాలల మహోన్నత త్యాగ ఫలంబునౌచు, నే డరుగుచు నుండె గాదె ’తెలగాణము’ పూర్ణ స్వతంత్ర మొందుచున్! అరువది యేండ్ల స్వప్న మిది, ఆకృతి దాలిచి ముందు నిల్చెడిన్!! నా ‘తెలంగాణ’ కోటి రత్నాల వీణ సర్వ స్వాతంత్ర్య రాష్ట్రమై సాకృతి గొన - అమరులైన వీరుల ఆత్మ లందె శాంతి! మురియుచుండ్రి ’తెలంగాణ’ భూమి సుతులు!! నేనురా తెలగాణ నిజ రాష్ట్ర సిద్ధికై ఆకాశమంత ఎత్తార్చినాను - నేను దాయాది దుర్నీతి పాలన గూర్చి పద్యాలు గొంతెత్తి పాడినాను - నే దాశరథి కవి నిప్పు లురుము గంట మొడుపులన్ కొన్నింటి బడసినాను - నేను భాగ్యనగరిన్ నిత్య వసంతుడై పద్య ప్రసూనాల పంచినాను – ఐదు కోటుల సీమాంధ్రు లందరికిని మా తెలంగాణ వ్యథ విడమరచి చెప్పి, మూడునర కోట్ల ప్రజలకు ముక్తి గలుగ - పాడినాను తెలంగాణ భాగ్య గీతి! శ్రీలంగూర్చగ దివ్య ‘భద్రగిరి’పై సీతమ్మగా ‘లక్ష్మి’యున్ - ఫాలంబందున జ్ఞాన రేఖలు లిఖింపన్ ‘బాసర’న్ ‘వాణి’యున్ - ‘ఆలంపూరు’న జోగులాంబగ శుభాలందింపగా ‘గౌరి’యున్ - మూలల్ మూడిట నిల్చి ముగ్గురమలున్ బ్రోచున్ తెలంగాణమున్! యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు! – డా. ఆచార్య ఫణీంద్ర
by DrAcharya Phaneendra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n2L0g6
Posted by Katta
by DrAcharya Phaneendra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n2L0g6
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి