తెలంగాణా కోసం, బలిదానం చేసుకున్న పిల్లల కోసం ఎప్పుడో రాసుకున్న కవిత .. తెచ్చిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు , మూలస్తంభాల్లా నిలబడి సాధించిన యువకులు .. ఇవాళ ఉద్యమం , రాజకీయంగా మారిన తరుణంలో వాళ్ళే గుర్తొస్తున్నారు .. మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నారు ..!! మేరె దిల్ కే టుక్డా ....భద్రం !! ఎందల కెల్లి ఎట్ల సచ్సిన్రో తెలీలా.. పోరగాండ్లు మల్ల తెలంగానం తెరపైకి తెచ్చిన్రు.. పాత గానమే.. ఎన్ని సార్లు లొల్లి పెట్టి శురూ చేసిన.. చెవిటోడి ముంగట ధన్కా బజాయించినట్టే.. సురూ చేస్తే చేసిన్ర్లు. వచ్చే టోల్లు సక్కంగున్ర్లు.. పోయే టోల్లూ చల్లన్గున్రు.. అట్లేల్లి సూసి రాండ్రి పిలగా౦డ్లారా. ఆంధ్ర అంత బాగున్నారు.. హైదరాబాద్ల మంచిగున్రు . ఆల్ల అస్తులల్ల రంగు రంగుల పాగాలు సుట్టి ఆల్ల బిల్డింగులు పతంగుల్లా పైకి లేస్తున్నాయి కొడకా.. సక్కంగా సదూకొని పొగ సూరిన తల్లుల జిందగీలు బదలయిస్తరంటే ఇట్ల దెబ్బలు తిన్నవేంది కొడకా.. ఇరుపక్కల ఆద్మీలతో చేసేది.. ఉద్యమంరా కొడకా.. బద్నాం మనసులతో కాదు.. నువ్వు జై ఆంధ్రా అను.. జై తెలంగానమను.. నువు సావకురో బిడ్డా వాళ్లకి ఫరక్ పడదు.. మాకు జిందగీ లేదు.. తెలంగాణా వస్తది అపుడు సూసుకునేందుకు నువ్వుండాలే కదా బిడ్డా !! బిడ్డ లేని గొడ్డుదాన్ని సేయ్యకురో ఈ యమ్మని మండిన మన మట్టి మనకి దక్కక ఏడ పోద్ది పోరు సెయ్యి పానాలు మాత్రం జర భద్రం కొడుకో ఈ అమ్మ దిల్ కి టుక్డా నని యాద్ మరవకు !! --సాయి పద్మ
by Sai Padma
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wUhle5
Posted by Katta
by Sai Padma
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wUhle5
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి