మెలకువ - - - - - పరుపు మెత్తదనం హాయినివ్వడం లేదు పచ్చికను కోల్పోయిన చింత నాది * నువ్వు చదివిన కవితా పాదమే అంతిమమనుకోకు చిత్తులో దాని వెర్షన్స్ ఎన్నో ఉన్నాయి * లోకం పల్లమై లాగుతూన్నది సముద్రంలో కలవడం ఇష్టం లేకే వంకలు పోతున్నాను * ఎవరి లెక్కలు వారికున్నాయి లెక్కలు లేనివాడే కదా మహా ఋషి * కొండ చివరాఖర్న కూచొని గొంతెత్తాను గ్రహ శకలాలన్నీ ఊసులు పోతున్నవి * మధువుతో మత్తిల్లి మనసులో గూడుకట్టుకున్న గోసలన్నీ పాడుతున్నాను ఈ రాత్రి ప్రకృతి మౌనంగా దుఃఖిస్తున్నది
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hCs7jT
Posted by Katta
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hCs7jT
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి