పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Venkat Jagadeesh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Venkat Jagadeesh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, ఏప్రిల్ 2014, ఆదివారం

Venkat Jagadeesh కవిత

ప్రభూ ! ప్రేమలో ఒక మహత్తరమైన దాన్నేదో కలిపావు... ఒక గొప్ప బాధ తో పాటు అంతులేని ఆనందంతో మిళితమై ఉంటుంది అది నువ్వు నన్నిందుకే ఈ లోకానికి పంపావా ? విరిగిన హృదయపు ముక్కలను వెతుక్కుంటూ రోదిస్తున్న నన్ను చూసి పరిహసిస్తున్నావా ? ఎవరికి నా కన్నీటిని ఆపే శక్తి ఉంది ? ఎదైనా చేయగలిగిన నీవు మా మద్య గోడలు నిర్మించావు.... ప్రభూ ! నే గొంతెత్తి పిలుస్తున్నా ! నువ్వు నిర్మించిన ఈ గోడలను పగలగొట్టే శక్తిని ఇవ్వు ! నేను ఏమి కోరాను నిన్ను ? ఒక గొప్ప ఇంద్రధనుస్సును సృష్టించమన్ననా ? దివ్యమైన తారలతో కూడిన అకాశాన్ని ఇవ్వమన్ననా ? నువ్వే కదా ! కోరకుండానే అవన్నీ ఇచ్చావు అన్నింటిని ఇచ్చి , నా హృదయాని జ్వలింప చేసేది ఏదో నా దగ్గర నుండి లాగేసుకున్నావు ! ఏ ?

by Venkat Jagadeesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jCn80T

Posted by Katta

12, ఏప్రిల్ 2014, శనివారం

Venkat Jagadeesh కవిత

నేనంటే నీకు ఎందుకు అంత ప్రేమో నాకు ఎప్పటికి అర్ధం కాదు... నా ఒంటరి నావలో చిల్లు పడి నీళ్ళు నన్ను ముంచెత్తినపుడు, నీ చేయినన్దించి నన్ను ఎందుకు ఫైకి లాగావో నాకు అర్ధం కాదు... నువ్వు సంచరించే పచ్చికబయళ్లను వదిలేసి చీకట్లో విషసర్పాలను కౌగిలించుకొని అవివేకిగా బ్రతుకుతున్న నాకు వెలుగును ఎందుకు ప్రసాదించావో నాకు అర్ధం కాదు.... నువ్వు నాకొసగిన మధుర జలాన్ని విస్మరించి ఎడారిలో ఎండమావులకై పరుగులు తీస్తున్న నా దప్పికను ఎందుకు తీరుస్తావో అర్ధం కాదు.... ప్రభూ ! ఎందుకు ? పదే పదే నిన్ను విస్మరిస్తున్న ఈ అజ్ఞానిఫై ఎందుకు దయ చూపుతావు ?

by Venkat Jagadeesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gl2dvu

Posted by Katta

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

Venkat Jagadeesh కవిత

నాకు , నీ క్రీడలను అర్ధం చేసుకునే సమయం లేదు ..... నేను గర్వం తో తల ఎత్తి నడుస్తున్నా.... నా కాళ్ళ క్రింద నలుగుతూన్న ముళ్ళను స్రవిస్తున్న రక్తపు ధారలను, నా నరాలలో సుడులు తిరుగుతున్న నొప్పిని అర్ధం చేసుకునే సమయం లెదు.... నేను, నేను ప్రేమించిన అన్నిటిని వదిలి వేసాను. నా లక్ష్యం చాలా ఉన్నత మైనదని నాకు చాలా రూడిగా తెలుసు. నీ సందేశాలను క్రోడికరంచడానికి నా తెలివిని వ్యయం చెసుకోను. నా మార్గంలొ ఆనందపు రాశులను నేను కన్నెత్తి కుడా చూడను. నన్ను సృష్టించినంత మాత్రాన నా లక్ష్యపు విలువను నువ్వు అర్ధం చేసుకుంటావని నేను భావించను. ఈ సాధారణ జీవితం లో నాకు ఉన్నత మైనదేమి కనిపించలేదు. ఈ గడ్డి పూలల్లో , వెండి మేఘాల్లో, నువ్వు చెప్పే మార్మిక మైనదేమి కనిపించ లేదు ఋతువులు వెంబడి నడుస్తున్నా, కాలంతో మారిపోయే వర్ణాలను చూస్తున్నా, నన్ను ప్రభావితం చేసేది ఏది కన్పించలేదు. నిన్ను నమ్మి, ఒకోసారి నా హృదయాన్ని కొద్దిగా తెరుస్తాను. కాని అంతలోనే నేను పొందబోయే గొప్ప జీవితం యొక్క ఆలోచనతో దాన్నికుచించేస్తాను ఓ నాలుగు క్షణాల ఆనందపు ఛాయ .....బహుసా అది గొప్పదే కావచ్చు. కాని నేను ఆశిస్తున్న, ఎదురు చూస్తున్న, ఎడతెగక పయనిస్తున్న, దాని ముందు దీని విలువ ఎంత ? నన్ను పోల్చవద్దంటావా ? ఎందుకు ? నా జీవితం లో నేను ప్రతిదీ పోల్చిచుసే ముందుకు సాగాను ఇక నీవు చెప్పే ఈ క్షణపు ఆనందమంటావా? దాన్నిఈ వెన్నెల రాత్రి లోనే కరగిపొనీ...... రాత్రుళ్ళు, పగళ్ళు, ఏళ్ళు గడచిపొనీ..... ఈ శరీరం ఇలానే శిధిలమైపొనీ........ నేను ఇలానే ఈ వెన్నెల రాత్రులను దాటుకుని నీశీధిలొకి ముందుకు సాగుతాను ......

by Venkat Jagadeesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kcPHmA

Posted by Katta