నరేష్కుమార్//అమ్మ అనసూయకోసం// ఇపుడేం రాసినా ఇదివరకు రాసింట్టే ఉంటోంది చెరిపేయబడ్డ అక్షరం మళ్ళీ చర్మం పై కాలిన మచ్చలా నన్నటిపెట్టుకున్నట్టే ఉంటోంది అమ్మ గురించి రాసిన ప్రతిసారీ నన్నునేను కాన్వాసుపై చిత్రించుకున్నట్టే ఉంటుంది ఒకానొక ప్రాచీన గీతాన్ని మళ్ళీ పాడినట్టే అనిపిస్తోంది ఇపుడెందుకో నేను వొంటరి గదిలో వంట చేసినపుడల్లా ఉప్పెక్కువైందంటూ ఆనాడు అమ్మ ముందు విసిరేసిన కంచం నా మొహాన్నే పడ్డట్టనిపిస్తుంది... "అన్నం తిన్నవా బేటా" అని ఫోన్లోంచి అమ్మచెయ్యి పొట్టనిమిరినప్పుడు కంట్లో కాలుజారిపడ్డ నీటిచుక్క నా మొహాన పడ్డ నిన్నటి సూర్యుడి ఉమ్మిలా అనిపిస్తోంది ఏం రాయనూ అమ్మకి ఏమివ్వనూ? అమ్మకిప్పుడు నేను నాన్ననవటం తప్ప ఇంకేం చేయను..... 13/04/14
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nhOURl
Posted by Katta
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nhOURl
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి