ఎక్కడి దూరం ? ఎన్ని సముద్రాలూ ఇటూ అటూ అల్లరి బాల్యాలై అలలై దారీ తెన్నూ లేకుండా పరుగులు పెట్టినా ఎన్ని చిక్కటి హరితవనాలు వనాలు ఎక్కడికక్కడ గుబురు పొదలై దిగులు చీకట్ల చేతుల్లో తలవాల్చుకున్నా పెదవులు దాటని పద పరిమళాలు చుట్టూ చుట్టూ అల్లుకున్న నులి వెచ్చని శ్వాస. ఎటు చూసినా రాత్రి ఆకాశం గూటిలో కునికిపాట్లు పడుతున్న చుక్క పసి కూనల ఆవులింతలు మంచు శాలువా కప్పుకు ఒణికే మసక వెన్నెల అయితేనేం గుప్పిళ్ళ కొద్దీ నిద్రను విసిరి కొసరి కొసరి అందించే స్వప్న సీమల అంచులలో అల్లనల్లన తేలివచ్చే మెత్తని పలకరింపు ఒక మౌన ధ్యానం ఒక సర్వాతీత సుందర తపస్సమాధిలో ఒక భావ లహరి విద్యుత్ ప్రవాహమై నా చుట్టూ ఒక ఆయస్కా౦త వలయమై నిర్విరామమై ,నిరంతరమై నిస్సందేహంగా ఇంకెక్కడి దూరం ?
by Swatee Sripada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oXumSK
Posted by Katta
by Swatee Sripada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oXumSK
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి