ఆలోచన బద్ధకాన్ని బ్రద్దలు కొట్టి ఒళ్ళు విరుచుకుంటుంది ఓ ఆలోచన భగీరథ ప్రయత్నానికి నడుం కట్టాలని ఆవేశంతో అనుసంధానించిన ఆలోచన ఎటైనా సాగొచ్చు...మంచికో చెడుకో....పతాకానికో అగాథానికో ఎటువైపో ఓ వైపు లాక్కెళుతుంది. ఆలోచనలన్నీ పొద్దు పోక చేస్తామనుకునేరు అందులోంచే ఓ పొద్దు పొడుస్తుంది నీ కళ్ళకు కమ్మిన చీకటి పొరను చీల్చుకొస్తుంది అందులోంచే పొడిబారని ఓ వెలుగు కిరణం అగ్నికెరటమై మస్తిష్కాన్ని తడుపుతూనే ఉంటుంది ఆ తడి తగిలి..మేల్కొన్న మనసు త్వరత్వరగా చచ్చుబడిన నీ అవయవాలను మర్దించి కార్యోన్ముఖం చేస్తుంటుంది ప్రస్తుతానికి ఆలోచనలన్నీ కట్టగట్టి కాళ్ళకింద తొక్కిపెట్టి ఒక్కో ప్రయత్నపు అడుగులో ఒక్కోటి చల్లుకుంటూ పోదాం ఏదో ఒక ఆలోచనైనా పచ్చగా మొలకెత్తకపోతుందా ఆ మొలకే మొదలు... తుది లేని ఇంకెన్నో ఆలోచనలను శాఖోపశాఖలుగా విస్తరింపజేయడానికి చిత్రం.... నా ఆలోచనలు ఆకాశంలో తారాల్లా మెరుస్తున్నాయి... చుక్కలు ఓ చెట్టు కొమ్మకు అతికించిన ఆకుల్లా వేళాడుతున్నాయిప్పుడు.! 11APR14
by Viswanath Goud
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBpGQz
Posted by Katta
by Viswanath Goud
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBpGQz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి