తిలక్/అంతా తెలుపే ::::::::::::::::::::::::::::::::::: కొన్ని రోజులు నీకు తెలియకుండానే కరుగుతుంటాయి నీ ముందే/నిజంగా నువ్వు బ్రతికావో లేదో తెలీదు నటించినట్లుగా అ(గు)నిపించినా ఎండాకాలమేగా రోహిణి కార్తే అని పగిలిన రోళ్ళ వైపు నీ చూపులు కాసిని సంతోషాలు మిగిలాయిలే గతాలను నేరుగా నరుక్కునపుడు అని మనసు జోబులోకి తొంగి చూస్తే అంతా ఖాళీయే నేలపై మట్టి చినుకులు ఆవిరైనట్టు కొన్ని జ్ఞాపకాలను మూకుట్లో దాచుకున్నావుగదాని ఉపరితలమంతా సానబెట్టేశాక మిగిలిన నుసిని పొట్ట సంధుల్లో విరివిగా పారబోసి వెతుకుతావు/అప్పుడక్కడ నిన్ను కంటూ మిగిలే ఓ శూన్యం వేర్ల పేగులన్ని బయటికొచ్చేశాక ఇక అడుగంటిన విత్తులను చేతివేళ్ళపై పండించుకుంటూ /కోతకు రాని హిమాలయాల గురించి మలయమారుతాలరో ఎదురుచూస్తుంటావు ఇక పాక్షికంగా కలగన్నాక తతిమా స్వప్నాలను పిండుకోగా రాలిన పుప్పొడి ప్రాణాలను పీల్చేస్తూ ఓ శ్వేత భైరవుడు/అదీ నువ్వే తిలక్ బొమ్మరాజు 10.04.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd1z84
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd1z84
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి