నాకు , నీ క్రీడలను అర్ధం చేసుకునే సమయం లేదు ..... నేను గర్వం తో తల ఎత్తి నడుస్తున్నా.... నా కాళ్ళ క్రింద నలుగుతూన్న ముళ్ళను స్రవిస్తున్న రక్తపు ధారలను, నా నరాలలో సుడులు తిరుగుతున్న నొప్పిని అర్ధం చేసుకునే సమయం లెదు.... నేను, నేను ప్రేమించిన అన్నిటిని వదిలి వేసాను. నా లక్ష్యం చాలా ఉన్నత మైనదని నాకు చాలా రూడిగా తెలుసు. నీ సందేశాలను క్రోడికరంచడానికి నా తెలివిని వ్యయం చెసుకోను. నా మార్గంలొ ఆనందపు రాశులను నేను కన్నెత్తి కుడా చూడను. నన్ను సృష్టించినంత మాత్రాన నా లక్ష్యపు విలువను నువ్వు అర్ధం చేసుకుంటావని నేను భావించను. ఈ సాధారణ జీవితం లో నాకు ఉన్నత మైనదేమి కనిపించలేదు. ఈ గడ్డి పూలల్లో , వెండి మేఘాల్లో, నువ్వు చెప్పే మార్మిక మైనదేమి కనిపించ లేదు ఋతువులు వెంబడి నడుస్తున్నా, కాలంతో మారిపోయే వర్ణాలను చూస్తున్నా, నన్ను ప్రభావితం చేసేది ఏది కన్పించలేదు. నిన్ను నమ్మి, ఒకోసారి నా హృదయాన్ని కొద్దిగా తెరుస్తాను. కాని అంతలోనే నేను పొందబోయే గొప్ప జీవితం యొక్క ఆలోచనతో దాన్నికుచించేస్తాను ఓ నాలుగు క్షణాల ఆనందపు ఛాయ .....బహుసా అది గొప్పదే కావచ్చు. కాని నేను ఆశిస్తున్న, ఎదురు చూస్తున్న, ఎడతెగక పయనిస్తున్న, దాని ముందు దీని విలువ ఎంత ? నన్ను పోల్చవద్దంటావా ? ఎందుకు ? నా జీవితం లో నేను ప్రతిదీ పోల్చిచుసే ముందుకు సాగాను ఇక నీవు చెప్పే ఈ క్షణపు ఆనందమంటావా? దాన్నిఈ వెన్నెల రాత్రి లోనే కరగిపొనీ...... రాత్రుళ్ళు, పగళ్ళు, ఏళ్ళు గడచిపొనీ..... ఈ శరీరం ఇలానే శిధిలమైపొనీ........ నేను ఇలానే ఈ వెన్నెల రాత్రులను దాటుకుని నీశీధిలొకి ముందుకు సాగుతాను ......
by Venkat Jagadeesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kcPHmA
Posted by Katta
by Venkat Jagadeesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kcPHmA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి